రంభ ఇల్లు అమ్మకానికి
చెన్నైలోని తన ఇంటిని రంభ అమ్మకానికి పెట్టింది. సినిమావాళ్ళు ఇళ్ళు అమ్ముకుంటున్నారంటే వారు అప్పుల పాలయ్యారని అందరూ అనుకుంటారు. కానీ రంభ ఆర్ధికంగా బాగానే ఉంది. హిందీ సినిమాలు ఏమీ లేనప్పటికీ ఆమె తరచుగా ముంబాయిలో గడుపుతోంది. ఈ విషయంలో వదంతుల సంగతి పక్కన పెడితే ఆమె ముంబాయిలో మంచి ఫ్లాట్ కొనుక్కునే ఆలోచనలో ఉన్నట్టు రూఢీగా తెలిసింది. ప్రస్తుతం కొత్త కథ సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా తన కెరీర్‌ను మళ్ళీ నిలబెట్టగలదని ఆమె ఆశిస్తోంది. సమ్‌థింగ్ సమ్‌థింగ్ సినిమాలో కూడా ఆమె నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఎటువంటి పాత్రకైనా ఒప్పుకుని ఎక్కువ సినిమాల్లో నటించాలని ఆమె నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications