రామ్ చరణ్ తమిళ 'మగధీర' కలెక్షన్స్ అస్సలు నిజం
రామ్ చరణ్ సూపర్ హిట్ మగధీరని తమిళంలో మావీరన్ టైటిల్ తో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అక్కడా హిట్టని, కలెక్షన్స్ అదరకొడుతున్నాయని ఊదరకొడుతున్నారు.అయితే నిజానికి అక్కడ అంత సీన్ లేదని సమాచారం. ఉన్న కొద్ది పాటి కలెక్షన్స్ ని ఆ సినిమా కి ఖర్చు పెట్టిన భారీ ప్రచార ఖర్చుతో పోలిస్తే వస్తున్న ఆదాయం తక్కువేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
డబ్బింగ్ కాకుండా నేరుగా తెలుగులోనే విడుదల చేస్తే మరింత ఎక్కువ ఆదాయం వచ్చేదని అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అలా జరగటానకి కారణం తెలుగు టీవీ ఛానళ్లలో సినిమా ప్రచారానికి గంటల చొప్పున నామమాత్రపు చెల్లింపులుంటే, తమిళనాట మాత్రం భారీగా ఉండటమేనని తేల్చారు.


Click it and Unblock the Notifications











