twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రచ్చ' చిత్రం విలన్ కి యాక్సిడెంట్

    By Srikanya
    |

    రామ్ చరణ్ రచ్చ చిత్రంలో విలన్ గా చేస్తున్న అజ్మల్ కి యాక్సిడెంట్ అయ్యింది. తమిళ చిత్రం వెట్రి సెల్వన్ షూటింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రక్త చరిత్ర ఫేమ్ రాధికా ఆప్టే తో కలిసి ఈ షూట్ లో అజ్మల్ పాల్గొన్నారు. డైరక్టర్ రుద్రన్ ఓ ఆటో రైడ్ సీన్ షూట్ చేస్తూండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. షూటింగ్ స్టాప్ ఊటీ. అక్కడ డైరక్టరక్...కెమెరా ..స్టార్టెడ్..రోలింగ్ అనగానే...డ్రైవర్ ఆటోని తీసుకుని బయిలుదేరారు..ఈ లోగా ఆటో స్పీడుగా వెళ్లటంతో బ్యాలెన్స్ తప్పి...ప్రక్కనున్న గోడకు గుద్దుకుని తిరగపడింది. వెంటేనే రాధికా ఆప్టేని,అజ్మల్ ని కలిసి హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.

    అక్కడ గోడ లేకుండా ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగేదని యూనిట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డాక్టర్ వెంటనే ...కాళ్లకు,మోచేతులుకు తగిలిన దెబ్బలకు ట్రీట్ మెంట్ చేసారు. రెండు రోజులు పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని చెప్తున్నారు. ఇక రంగంతో తెలుగు వారికి పరిచయమైన అజ్మల్..రచ్చలో మెయిన్ విలన్ గా పెద్ద పాత్రనే పోషిస్తున్నారు. ఆ పాత్ర కథలో కీలకమై ఉంటుందని చెప్తున్నారు.

    English summary
    Ajmal villain in Ramcharans new flick Rachcha met an accident at Shooting spot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X