ప్రభుదేవా భార్య రమాలత్ ఆత్మహత్యా యత్నం?
ప్రభుదేవా భార్య రమాలత్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు చెన్నైలో వార్తలు గుప్పుమన్నాయి. రమాలత్ తనకు చట్టబద్దమైన భార్య కాదని ప్రభుదేవా ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమాలత్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. రమాలత్ తనకు చట్టబద్దమైన భార్య కాదని ప్రభుదేవా ప్రకటించిన తర్వాత రమాలత్ విచిత్రంగా ప్రవర్తిస్తూ వచ్చిందని అంటున్నారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రమాలత్ ను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. ప్రభుదేవాను, నయనతారను నిందిస్తూ ఓ లేఖను కూడా ఆమె రాసిపెట్టినట్లు తెలుస్తోంది. తాను ఆత్మహత్యయత్నం చేయడానికి వారిద్దరే కారణమని ఆమె ఆందులో రాసినట్లు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











