For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నయనతార దుష్టశక్తి..కాపురాన్ని నిలువునా చీల్చింది..కనిపిస్తే ఏం చేస్తానో..భగ్గుమన్న ప్రభుదేవా భార్య

  |

  కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, అందాల భామ నయనతార మధ్య అఫైర్ అప్పట్లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వారిద్దరి మధ్య చోటుచేసుకొన్న ఘాటు ప్రేమాయణంపై మీడియాలో హాట్ హాట్ చర్చ జరిగింది. అయితే వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి.. పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లి మాట పక్కన పెడితే .. అసలికే మోసం వచ్చి వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు. అయితే ఆ విషయంలో ప్రభుదేవా భార్య రమాలత్ ఇప్పటికీ కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

   ప్రభుదేవా కోసం మతం మార్చుకొని

  ప్రభుదేవా కోసం మతం మార్చుకొని

  ప్రభుదేవా, రమాలత్‌ది ప్రేమ, పెళ్లిని మించిన వివాహం. 1995లో వారిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకొన్నారు. రమలాత్ ముస్లిం మతానికి చెందిన వారు. అయితే ప్రభుదేవా కోసం తన మతాన్ని మార్చుకొని హిందూ మతంలోకి ప్రవేశించారు. పిల్లలతో కుటుంబం హాయిగా గడిచిపోతున్న క్రమంలో వారి దాంపత్య జీవితంలో ఓ భారీ కుదుపులు మొదలయ్యాయి.

  నయనతార అడుగుపెట్టనంత వరకు

  నయనతార అడుగుపెట్టనంత వరకు

  నయనతారతో ప్రేమాయణం వరకు ప్రభుదేవా దాంపత్య జీవితం సాఫీగా సాగిపోయింది. ఆ క్రమంలోనే 2008లో ప్రభుదేవా కుమారుడు క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. ప్రభుదేవా జీవితంలోకి నయనతార ప్రవేశించడంతో 2011లో తన భార్య రమాలత్‌కు విడాకులు ఇచ్చేశారు. దాంతో వారి దాంపత్య జీవితానికి పూర్తిగా తెరపడింది.

  నయనతారపై భగ్గుమన్న ప్రభుదేవా భార్య

  నయనతారపై భగ్గుమన్న ప్రభుదేవా భార్య

  నయనతార వల్ల తన కుటుంబం బజారున పడటంపై ఇప్పటికీ రమాలత్ భగ్గుమంటున్నారు. నయనకు శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నా భర్తను నా నుంచి నయనతార దొంగిలించారు. ఒక ఇంటిని నిట్టనిలువునా కూల్చిన ఆమెను దేవుడు శిక్షిస్తాడు అని రమాలత్ మండపడ్డారు.

  భర్తలను లాగేసుకొని వారిని

  భర్తలను లాగేసుకొని వారిని

  ఒకరి కుటుంబంలోకి దొంగదారిన ప్రవేశించి భర్తలను లాగేసుకొనే మహిళలను దేవుడు కఠినంగా శిక్షించాలి. ఉద్దేశపూర్వకంగా నా భర్తను నాకు కాకుండా చేసిన నయనతారను అరెస్ట్ చేయాలి. చట్టాలు కఠినంగా శిక్షించాలి. నా కంటికి నయనతార కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నయనతార దుష్టశక్తి అనడానికి ఏ మాత్రం సంకోచించను అని రమాలత్ అన్నారు.

  కుటుంబం అంటే ప్రాణంగా భావించే

  కుటుంబం అంటే ప్రాణంగా భావించే

  ప్రభుదేవా చాలా సిన్సియర్. కుటుంబ అంటే ప్రాణాలిచ్చేంతటి భర్త. 15 ఏళ్ల పాటు మాకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకొన్నారు. మాకు మంచి ఇళ్లు, పిల్లలకు చదువులు చెప్పించారు. కానీ నయనతార రావడంతో మా కుటుంబమంతా తలకిందులైంది. ఆయన ప్రవర్తన చూసి నేనే కాదు.. ఆయన కుటుంబ కూడా షాకైంది. పెళ్లైన వ్యక్తి మరో మహిళతో ఉండటమనేది మా వంశంలో ఎప్పుడూ లేదు అని రమాలత్ ఆవేదన వ్యక్తం చేశారు.

  Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral
  నయన తార ఏం మాయ చేసిందో

  నయన తార ఏం మాయ చేసిందో

  సినిమాలు, కుటుంబం తప్ప మరో ధ్యాస ఉండేది కాదు. కానీ ప్రభుదేవాను ఏం చేసి నయనతార తనవైపుకు తిప్పుకొన్నారో ఇప్పటికి అర్ధం కాదు. కానీ ఆమె వల్ల మా కుటుంబం సర్వనాశనమైంది. ఎప్పటికీ మా కుటుంబం కోలుకోని విధంగా మారింది. అలాంటి వ్యక్తిని ఎప్పుడో ఒకప్పుడు దేవుడు దారుణంగా శిక్షిస్తాడు అని రమాలత్ శాపాలు పెట్టారు.

  English summary
  Actor Prabhudeva wife Ramlath curses on Nayanatara: She fires with furious words on Nayan. So Once again Prabhudeva personal life hits media headlines.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X