For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    పోర్న్ స్టార్ పాత్రలో రమ్యకృష్ణ.. ఆ సీన్ కోసం ఏకంగా 37 టేక్స్, 2 రోజులు!

    |

    తమిళంలో రూపొందుతున్న 'సూపర్ డీలక్స్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం రొటీన్ మూస సినిమాలకు భిన్నంగా ఉంటుందని, ఈ నాలుగు పాత్రలు డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంటుందనే చర్చ సాగుతోంది.

    ఇందులో ప్రముఖనటి రమ్యకృష్ణ పోర్న్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఆమె పాత్ర తెరపై ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది.

    రమ్యకృష్ణ కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్

    రమ్యకృష్ణ కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్

    తాజాగా ఓ ఆంగ్లపత్రికతో రమ్యకృష్ణ మాట్లాడుతూ... ‘తన కెరీర్లోనే ఇది మోస్ట్ ఛాలెంజింగ్ రోల్' అని తెలిపారు. ఈ చిత్రంలో నటుల కంటే కంటెంటుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు కుమార రాజా రాసుకున్న కథ అద్భుతంగా ఉందన్నారు.

    37 టేక్స్, 2 రోజులు

    37 టేక్స్, 2 రోజులు

    ఈ చిత్రంలో రమ్యకృష్ణపై చిత్రీకరించిన ఓ సీన్ అనుకున్న విధంగా రావడం కోసం 37 టేక్స్‌ తీసుకున్నారట. ఇందుకోసం రెండు రోజుల సమయం వెచ్చించినట్లు తెలుస్తోంది. ‘ఈ విషయంలో నా కంటే నా అసిస్టెంట్స్ ఎక్కువగా షాకయ్యారు. కొన్ని పాత్రలు డబ్బు కోసం చేస్తాం, కొన్ని పాత్రలు పాపులారిటీ, పేరు కోసం చేస్తాం. కొన్ని పాషన్‌తో చేస్తాం. ఈ సూపర్ డీలక్స్ మూవీ మాత్రం పాషన్‌తో చేస్తున్నా' అని రమ్యకృష్ణ తెలిపారు.

    రమ్యకృష్ణ పర్ఫెక్ట్, తనకు తానుగా...

    ఓ వీడియో ఇంటర్వ్యూలో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా, స్క్రీన్ ప్లే రైటర్ మిస్కిన్ మాట్లాడుతూ... చాలా సీన్లు 100 నుంచి 150 టేక్స్ తీసుకున్నామని తెలిపారు. రమ్యకృష్ణ పాత్ర గురించి మాట్లాడుతూ... ఈ చిత్రంలో పోర్న్ స్టార్ పాత్రలో చేయడానికి రమ్యకృష్ణ తగిన వ్యక్తి. ఆమె ‘మల్లు అన్‌కట్' అనే చిత్రంలో నటించే నటిగా ‘సూపర్ డీలక్స్'లో కనిపించబోతున్నారు. ముందు మేము ఈ పాత్ర కోసం నదియాను సంప్రదించాం. రమ్య కృష్ణ ఇంకా పర్ఫెక్ట్ అనిపించారు. ఆమె తనకు తానుగా ఆమె ఈ పాత్రలో లీనమైపోయి, ఎంతో కంఫర్టుగా నటించారు' అని తెలిపారు.

    సూపర్ డీలక్స్

    సూపర్ డీలక్స్

    విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. పిఎస్. వినోద్, నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

    English summary
    Director Thiagarajan Kumararaja made Ramya Krishnan do a particular scene 37 times over two days for Super Deluxe movie. Super Deluxe which stars Vijay Sethupathi, Fahadh Faasil, Ramya Krishnan, Mysskin and Ramya Krishnan will release worldwide on March 29.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more