పోర్న్‌స్టార్‌గా రమ్యకృష్ణ.. స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేస్తే.. షాకివ్వబోతున్న శివగామి!
బాహుబలి చిత్రంలో శివగామిగా ప్రేక్షకుల చేత ప్రశంసలందుకొన్న రమ్యకృష్ణ ఎప్పడూ విభిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇటీవల విడుదలైన శైలజారెడ్డి, హలో చిత్రాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించే పాత్ర ఆసక్తికరంగా ఉంటుందనే సినీ వర్గాల వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

సూపర్ డీలక్స్ మూవీలో
సూపర్ డీలక్స్ మూవీలో రమ్యకృష్ణ గతంలో పోషించనటువంటి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో భాగంగా మల్లు కట్ అనే సినిమాలో శృంగారతారగా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు లీలా. ఈ పాత్ర కోసం తొలుత నదియాను సంప్రదించాం. కొన్ని కారణాల వల్ల ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదు అని దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా వెల్లడించారు.

శృంగార తార పాత్రలో కూల్‌గా
నదియా రిజెక్ట్ చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు. ఎలాంటి సందేహాలు లేకుండా పోర్న్ స్టార్‌గా నటించేందుకు రమ్యకృష్ణ ముందుకు వచ్చారు. చాలా కూల్‌గా తన పాత్రలో ఒదిగిపోయారు. నటిగా తనకు ఉన్న ఇమేజ్‌ను పక్కన పెట్టి ఈ పాత్రలో నటించడం నిజంగా అభినందనీయం అని దర్శకుడు అన్నారు.

లింగమార్పిడి మహిళగా విజయ్ సేతుపతి
సూపర్ డీలక్స్ చిత్రంలో హీరో విజయ్ సేతుపతి ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నారు. లింగమార్పిడి చేసుకొన్న మహిళగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు. అలాగే ఈ చిత్రంలో సమంత, ఫహద్ ఫాజిల్ జంటగా నటిస్తున్నారు. మృతదేహాన్ని అమ్మడానికి తంటాలు పడే పాత్రల్లో నటించారు.

చెన్నైలో 24 గంటల్లో జరిగే
చెన్నై నగరంలో 24 గంటల్లో జరిగే కథతో సూపర్ డీలక్స్ సినిమాను దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి పీసీ శ్రీరాం, పీఎస్ వినోద్, నీరవ్ షా సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. దర్శకుడు మిస్కిన్, గాయత్రి భాగవతి పెరుమాళ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











