నగ్నంగా ఉన్న ఫోటో పోస్ట్.. ఫేక్ ఐడీలపై ఫైర్.. నటి ఫిర్యాదు
సోషల్ మీడియా వాడకం పెరిగాక ఎన్ని ఉపయోగాలున్నాయో.. అన్ని రకాలుగా చేటు చేస్తున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఇవి పెద్ద తలపోటుగా మారాయి. స్టార్ హీరో, హీరోయిన్లకు అలాంటి బాధలు లేకపోయినా.. అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న వారికి పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ సెలెబ్రిటీలు తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే చోట ఫేక్ ఐడీలు పేట్రేగిపోతున్నాయి.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ..
స్టార్ హీరోల నుంచి సాధారణ నటీనటుల దాకా సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా గడిపేస్తుంటారు. వారి సినిమా అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకునేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు.దాదాపు అందరూ తమ అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను వాడుతూ ఉంటారు.

ఫేక్ ఐడీలతో తలనొప్పి..
బడా హీరోలు, హీరోయిన్లకు అధికారిక ఖాతాలుంటాయి.. వాటిని ఈజీగా గుర్తుపడతారు నెటిజన్లు. అయితే చిన్న చిన్న హీరోలు, నటీమణులకు అలాంటి సదుపాయాలుండవు. వారిని ఐడీలను అంత ఈజీగా గుర్తు పట్టలేము. ఒకే పేరు మీద కొన్ని వేల ఐడీలుంటాయి. అవే వారికి తలనొప్పిని తీసుకొస్తాయి.
తమిళ నటికి అదే సమస్య..
ఈమధ్య కాలంలో రమ్య పాండ్యన్ అనే నటి సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. జోకర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి చిత్రంతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించిన ఆకతాయిలు హద్దులు దాటారు.
Recommended Video

నగ్నంగా ఉన్న ఫోటో..
హాఫ్ న్యూడ్‌తో నగ్నంగా నిల్చుని ఉన్న ఓ అమ్మాయిని ఫోటోను షేర్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి దిగిన ఫోటో కావడంతో మొహం కనబడలేదు. అయితే ఈ ఫోటోను రమ్య పాండ్యన్ అకౌంట్ నుంచి షేర్ చేయడంతో అంతా ఆమె అనుకుంటున్నారు. తీరా ఈ విషయం ఆమె వద్దకు వెళ్లడంతో దాన్ని ఖండిస్తూ.. ఫేక్ ఐడీపై ఫైర్ అయింది. వాటిపై ఫిర్యాదు చేస్తానని తెలిపింది. అంతేకాకుండా తన ఒరిజినల్ ఐడీలను మరోసారి అభిమానులకు తెలియజేసింది.


Click it and Unblock the Notifications











