రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ భేష్
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన రమ్యకృష్ణ కొంతకాలం హైదరాబాద్‌లో కాపురం చేసుకుంది. కొన్ని నెలలక్రితం చెన్నై వెళ్ళిన రమ్య మళ్ళీ హైదరాబాద్‌కు తిరిగిరాలేదు. తల్లి వద్దనే ఉంటున్న ఆమె ఇటీవల రామానాయుడు నిర్మించిన శ్రీకృష్ణ 2006 సినిమాలో నటించింది. అది చిన్న పాత్రే అయినా తనకు చాలాకాలం పెద్ద దిక్కుగా ఉన్న రామానాయుడు చిత్రం కాబట్టి ఆమె ఆ సినిమాలో కన్పించింది. ఈ మధ్య కాస్త వళ్ళు చేసినా గ్లామర్ ఏ మాత్రం తగ్గని రమ్య జెమినీ టీవీలో ప్రస్తుతం బంగారం మీకోసం ప్రోగ్రాంలో యాంకర్‌గా చేస్తోంది. రాధిక స్ధానంలో ఆమె రావడంతో ఆ కార్యక్రమం పాపులారిటీ బాగా పెరిగిపోయింది. సన్‌నెట్ వర్క్‌లో ఆమె బంగారు చేపలా చిక్కుకుపోయింది. రాధిక కరుణానిధికి దూరమై గత తమిళనాడు ఎన్నికల ముందు జయలలిత పంచన చేరడంతో సన్ వారు రాధికకు గుడ్‌బై చెప్పి రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నారు. ఇక కృష్ణవంశీ, రమ్యకృష్ణల అనుబంధం ఏ సినిమాటిక్ మలుపు తీసుకుంటుందో తెలియకుండా ఉంది.


Click it and Unblock the Notifications