బిగ్ బాస్ స్పెషల్ హోస్ట్ గా సీనియర్ హీరోయిన్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రతీ భాషలోనూ మంచి క్రేజ్ అందుకుంటోంది. ముఖ్యంగా తెలుగు తమిళ్ లో అయితే మొదటి సీజన్ లోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అసలు సౌత్ లో ఈ షో సక్సెస్ కాదని మొదట్లో చాలా రకాల కామెంట్స్ అయితే వచ్చాయి. కానీ మన స్టార్ హీరోల హోస్టింగ్ తోనే రావాల్సిన క్రేజ్ భారీగానే వచ్చేసింది. తమిళంలో అయితే కమల్ హాసన్ కూడా చాలా ఈజీగా క్రేజ్ వచ్చేలా చేశారు. ఇక మధ్యలో హీరోలు కొంత గ్యాప్ తీసుకుంటే రంగంలోకి సీనియర్ నటీమణులు కూడా వస్తున్నారు. ఇక తమిళ్ బిగ్ బాస్ కు ఇప్పుడు కమల్ హాసన్ బ్రేక్ ఇవ్వడంతో మరో సీనియర్ నటీమణి భారీ పారితోషికం తీసుకొని వస్తున్నట్లు సమాచారం.

విమర్శలు ఎన్ని వస్తున్నా

విమర్శలు ఎన్ని వస్తున్నా

కాంట్రవర్సీ షోగా క్లిక్కయిన బిగ్ బాస్ పై విమర్శలు ఎన్ని వస్తున్నా కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీజన్ 5కి కూడా మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇక షో ఆసక్తిగా కొనసాగుతున్న సమయంలోనే కమల్ హాసన్ కరోనా భారిన పడడం అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు బిగ్ బాస్ కు మళ్ళీ ఎవరు హోస్టింగ్ చేస్తారని అనుకున్న సమయానికి నిర్వాహకులు ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు.

కమల్ హాసన్ తప్పితే..

కమల్ హాసన్ తప్పితే..

మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా రమ్యకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. తెలుగు తమిళంలో ఇదివరకే ఒకసారి రమ్యకృష్ణ మంచి హోస్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఇక చాలా రోజుల తరువాత మళ్ళీ ఆమె అవసరం పడింది. కమల్ హాసన్ హఠాత్తుగా కరోనా భారిన పడడంతో నిర్వాహకులు మరొక హీరోను సెలెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీలో కమల్ హాసన్ తప్పితే మిగతా వారు ఎవరు కూడా అందుకు సిద్ధంగా లేరని అర్ధమయ్యింది.

శృతి హాసన్ బిజీబిజీగా..

శృతి హాసన్ బిజీబిజీగా..

మొత్తానికి రమ్యకృష్ణను అయితే ఫైనల్ చేసేశారు. అందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా విడుదల చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారు. కానీ ఆమె పెద్ద సినిమాలతో చాలా బిజీగా ఉంది. గ్యాప్ దొరకడం చాలా కష్టమని ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. శృతి హాసన్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అదే ఆమెకు మొదటి పాన్ ఇండియా మూవీ.

Recommended Video

Jeethu Joseph About Remaking His Own Movies | Drushyam 2
రమ్యకృష్ణ ఫైనల్

రమ్యకృష్ణ ఫైనల్

రమ్యకృష్ణ కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మొదట ఆమె కూడా చేయకపోవచ్చు అని చెప్పారట. కానీ కమల్ హాసన్ ప్రత్యేకంగా ఆమెను కోరడంతో కొన్ని షెడ్యూల్స్ ని వాయిదా వేసుకొని బిగ్ బాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతే కాకుండా ఆమెకు రెమ్యునరేషన్ కూడా బాగానే ఇస్తున్నారాట. సినిమాలకే రోజుకు 10లక్షల వరకు డిమాండ్ చేస్తున్న రమ్యకృష్ణ బిగ్ బాస్ షోకు కూడా అదే తరహాలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X