'నా ఆటోగ్రాఫ్' చేరన్ దర్శకత్వంలో తెలుగు హీరో
'నా ఆటోగ్రాఫ్' వంటి ఎన్నో ఫీల్ గుడ్ ఫిలిమ్స్ డైరక్ట్ చేసిన చేరన్ ఇప్పుడు తెలుగు హీరో రాణాతో ఓ చిత్రం కమిటయ్యినట్లు తెలుస్తోంది.తెలుగు,తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం జనవరి లో ప్రారంభమయ్యే అవకాశముందని చెప్తున్నారు.అలాగే రాణా తమిళంలో శింబు హీరోగా చేసే మరో చిత్రంలో కూడా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాడ చెన్నై టైటిల్ తో రూపొందే ఈ చిత్రాన్ని వెట్రిమారన్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు.శింబు సరసన అమలా పౌల్,రాణా సరసన ఆండ్రియా హీరోయిన్స్ గా ఈ చిత్రంలో చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాణా ..ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో నా ఇష్టం చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రంలో దగ్గుబాటి రాణా సరసన జెనీలియా నటిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మాత.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరిగాయి. మూడవ షెఢ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్‌లో జరగుతుంది. 'నవంబర్ 5 వరకూ జరిగే ఈ షెడ్యూల్‌లో హీరో హౌస్, హీరోయిన్ హౌస్‌కి సంబంధించిన సన్నివేశాలను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ని, ఓ ఐటెం సాంగ్‌ని చిత్రీకరిస్తాం. రాణా, జెనీలియాతో పాటు ఆలీ, విజయ్, చిత్రం శ్రీను తదితరులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు' అని నిర్మాత కిరీటి చెప్పారు. ఫీల్‌గుడ్ యూత్‌ఫుల్ మూవీగా రూపొందుతున్న 'నా ఇష్టం' రాణా కెరీర్‌లో ఓ చక్కని చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు ప్రకాష్ చెప్పారు. బ్రహ్మానందం, హర్షవర్ధన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, అజయ్, భరత్, ఉత్తేజ్, శ్రీనివాసరెడ్డి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, పృథ్వీ, జోగి బ్రదర్స్ నటిస్తున్న ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, రచనా సహకారం: చంద్రశేఖర్ , టి.రమేష్, వేమారెడ్డి, శ్రీకర్, సంగీతం: చక్రి, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.గోపాలకృష్ణ, నిర్మాత: పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రకాష్ తోలేటి.


Click it and Unblock the Notifications











