పవన్ కళ్యాణ్ డైరక్టర్ తో రానా దగ్గుపాటి ఖరారు
ఈ గెస్ట్ రోల్ విషయమై రానా "ముంబై వచ్చాను..చాలా గ్యాప్ తర్వాత...ఇక్కడ అజిత్,విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాను. అదో తమిళ చిత్రం. ముంబైలో తమిళం" అంటూ ట్వీట్ చేసారు. ఇక ప్రస్తు రానా..క్రి ష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. కృష్ణం వందే జగద్గురం టైటిల్ తో రూపొందే ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూ గా జరుగుతోంది. ఈ చిత్రంలో రానా బిటెక్ బాబుగా కనిపించనున్నాడు. ఆ పాత్ర డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు. మైనింగ్ మాపియా మీద యుద్దం ప్రకటించే కుర్రాడిగా రానా కనిపిస్తాడని, అతను ఈ చిత్రంలో నాటకాలు వేస్తాడని అంటున్నారు.
క్రిష్ మీడియాతో రానా పాత్ర గురించి మాట్లాడుతూ..."అతని పేరు బాబు. చదివింది బీటెక్. అందుకే అన్నీ హైటెక్ తెలివి తేటలు. పుస్తకాల్లో చదివిన జ్ఞానం కంటే... జీవితాల్లోంచి గ్రహించిందే ఎక్కువ. ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి... తప్పించుకొన్న శ్రీకృష్ణతత్వం బాగా అలవాటు చేసుకొన్నాడు. అదే అనుసరించాడు. అసలింతకీ ఈ బీటెక్ బాబు కథేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే" అన్నారు.
ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా రానా సరసన చేస్తోంది. నయనతార పాత్ర పేరు దేవిక. ఆమె డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. ఈ పాత్ర చిత్రంలో కీలకమై నడుస్తుంది. ఈ విషయం దర్శకుడు క్రిష్ చెపుతూ...''నా సినిమాల్లో హీరోయిన్ పాత్రకూ ప్రాముఖ్యం ఉంటుంది. 'గమ్యం'లో జానకి, 'వేదం'లో సరోజ పాత్రలు కథను ముందుండి నడిపించాయి. ఈ సినిమాలోనూ అలాంటి పాత్రే ఉంది. నయనతార దేవికగా కనిపిస్తుంది. బీటెక్ బాబు మాస్ అయితే దేవిక క్లాస్. డాక్యుమెంటరీలు తీస్తుంటుంది. వీరిద్దరి సంబంధం ఏమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది''అన్నారు.


Click it and Unblock the Notifications












