రజనీ కోసం రానా స్క్రిప్ట్ లో మార్పు...!
రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా గత కొన్ని నెలల క్రితం చ్నైలోని ఏవీఎం స్టూడియోస్ లో పూజాకార్యక్షికమాలు జరుపుకున్న చిత్రం 'రానా". దీపికా పదుకునే కథానాయిక. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం రజనీకాంత్ అనారోగ్య కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సింగపూర్ లో ప్రత్యేక చికిత్స చేయించుకుని అక్కడే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న రజనీ ఈ మధ్య చ్నైకి తిరిగొచ్చారు. రెండు నెలల విశ్రాంతి అనంతరం రజనీకాంత్ అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న 'రానా" చిత్రం షూటింగ్ లో పాల్గొన బోతున్నాడు. పిరియాడికల్ ఫిలింగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజనీ వారియర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
పోరాట సన్నివేశాలు అధికంగా వుండే ఈ చిత్రంలో రజనీ భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి వుంటుంది. అయితే ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన ప్రస్తుతం ఎలాంటి భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించకూడదని డాక్టర్లు చూచించడంతో రజనీకి అనుకూలంగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలా లేక పోరాట సన్నివేశాల్లో రజనీకాంత్ కు బదులు ఆయన డూప్ ని పెట్టుకుని ఆ సన్నివేశాలని చిత్రీకరించాలా అని దర్శకుడు కెఎస్ రవికుమార్ ప్రస్తుతం తర్జన భర్జన పడుతున్నట్టు చ్నై సినీ వర్గాల కథనం. 'రానా" చిత్రాన్ని తన కలల ప్రాజెక్ట్ గా భావిస్తున్న రజనీకాంత్ అక్టోబర్ లో 'రానా" షూటింగ్ మొదలవుతుందని, ఏది ఏమైనా షూటింగ్ లో పాల్గొంటానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారట.


Click it and Unblock the Notifications











