తమిళ, మలయాళంలోకి రంగస్థలం
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన రంగస్థలం చిత్రం ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకొన్నది. రాంచరణ్, సమంత నటించిన ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకులకు వస్తున్నది. గ్రామీణ కథా నేపథ్యంతో చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ తాజా వార్త వెలుగులోకి వచ్చింది.
రంగస్థలం తమిళం, మలయాళల భాషల్లోకి కూడా డబ్బింగ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారట. ఈ చిత్రాన్ని ఏప్రిల్ గానీ, మేలో గానీ రెండు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. రాంచరణ్, సమంత, అనసూయ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌డైరెక్టర్. ఈ చిత్రంలోని పాటలకు ప్రేక్షకులు ఇప్పటికే బ్రహ్మరథం పడుతున్నారు.



Click it and Unblock the Notifications











