Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
సెక్స్ స్కాండల్ రంజితకు పునర్జన్మనిచ్చిన దర్శకుడు....
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'నాడోడి తెండ్రయ్" అనే తమిళ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది రంజిత. బహుశా ఆ సినిమా చూసాకనే, రంజితను తన శిష్యురాలిగా చేసుకోవాలని డిసైడైపోయి ఉంటాడు సెక్స్ స్వామి నిత్యానంద. తనచే పరిచయం చేయబడిన తన శిష్యురాలికి పట్టిన దుర్గతిని చూసి భారతీరాజా కడుపు తరుక్కుపోయిందో ఏమో కానీ..ఆమెతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు నడుం కడుతున్నాడు.
మరి ఈ సినిమాకు పెట్టుబడి నిత్యానంద పెడుతున్నాడో, లేక రంజితకకు వీరాభిమాని అయిన మరో నిర్మాత ఎవరైనా పెడుతున్నాడో మనకు తెలియదు కానీ..అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. రంజిత నటించిన చివరి చిత్రం 'రావణ్" (తెలుగులో విలన్), అయితే, నిత్యానందునికి శృంగారసేవలందిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినందున, రంజితపై చిత్రీకరించిన సీన్స్ ను పూర్తిగా ఎడిట్ చేసారు. సెక్స్ స్కాండల్ లో బయటపడ్డాక, రంజితకు ఏర్సడిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి పలువురు నిర్మాతలు క్యూలు కట్టినప్పటికీ..మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న రంజితను భారతీరాజా కరుణించాడు. హీరోయిన్ గా తనకు జన్మనిచ్చిన భారతీరాజానే నటిగా తనకు పునర్జన్మ ఇవ్వబోతుండడం పట్ల రంజిత తెగ సంబరపడిపోతున్నదంట..