సెక్స్ స్కామ్ హీరోయిన్ రంజిత మళ్ళీ మొదలెట్టింది
నిత్యానంద స్వామి సెక్స్ స్కామ్ తో ఆమధ్య వార్తలకెక్కిన రంజిత సెకెండ్ ఇన్నింగ్స్ మెదలెట్టింది. రాసలీలలు,వీడియో టేప్‌లు అంటూ పాపులర్ అయిన ఆమె కొంతకాలంగా అమెరికాలోని తన సోదరి ఇంట్లో ఉంటోంది. ఆ తర్వాత అనూహ్యంగా చెన్నై కోర్టుకు హాజరై నిత్యానందస్వామీజీతో కలిసి వీడియో టేపుల్లో ఉన్నది తాను కాదని వెల్లడించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ- తాను నటనకు స్వస్తి చెప్పలేదని, మంచి పాత్రలు లభిస్తే నటించడానికి సిద్ధమని తెలిపారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన విలన్ చిత్రంలో రంజిత ప్రభుకు జోడీగా కొన్ని సన్నివేశాల్లో నటించారు. ఇప్పుడు మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన 'ఓడుమ్ మే ఘంగళే" అనే చిత్రం త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











