సెక్స్ స్వామితో అనుభవాలపై పుస్తకం: రంజిత
సెక్స్ స్వామి నిత్యానందతో తనకు ఎదురైన అనుభవాలను పుస్తకంగా ప్రచురిస్తానని నటి రంజిత మీడియాకు తెలిపారు. ఆ పుస్తకం పేరు 'హౌటు సర్వైవ్ ఎ స్కాండిల్'. తాను రాయబోయే పుస్తకం ఉపయోగం వివిరిస్తూ...ఆ పుస్తకం..తనలా ఒంటరిగా సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మార్గం చూపుతుందంటోంది. ఆ పుస్తకంలో ముఖ్యంగా వివాదం అనంతరం తనకు జరిగిన అవమానాలను పొందుపరుస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె...గత ఆరు నెలల కాలం..తన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చిందని, గతంలో ఎన్నడూ పడనన్ని కష్టాలు అనుభవించానని చెప్పుకొచ్చారు. ఆ చేదు అనుభవాలకు పుస్తక రూపం ఇవ్వటమే సరైన మార్గమని ఆమె అన్నారు.
నిత్యానంద, రంజితలు కలిసి ఉన్న దృశ్యాలతో కూడిన సీడీని ఓ తమిళ చానల్ ప్రసారం చేయడం..అది దేశమంతటా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో అరెస్టయిన నిత్యానంద రీసెంట్ గా బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం రంజిత ఓ తమిళ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పుస్తక ప్రచురణకు సంబంధించి కొందరు పబ్లిషర్లతో ఇప్పటికే మాట్లాడానని చెప్పారు. ఈ పుస్తకం ద్వారా తన అభిమానులు అనుమానాలకు, ప్రశ్నలకు జవాబు దొరుకుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నిత్యానందతో తనకున్న పరిచయంతో పాటు, సీడీ బయటకు వచ్చిన తరువాత తాను పడిన అవమానాలు, ఇబ్బందులను కూడా ఈ సందర్భంగా ఆమె వివరించారు. తానొకటి చెబితే పత్రికలొకటి రాస్తున్నాయని వాపోయారు. టేపులు బయటపడి చాలా కాలమైనా మీడియా ఇంకా తనను వెంటాడుతోందని చెప్పారు. తాను నటించిన రావణన్ సినిమా విడుదలై ఇంతకాలమైనా..చూడలేకపోతున్నానన్నారు.గతం గురించి తాను ఆలోచించడం లేదన్న రంజిత..భవిష్యత్తులో నటించాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











