twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సారీ చెప్పిన రాశి ఖన్నా.. నీపై ఎంతో ప్రేమ ఉందంటూ పోస్ట్

    |

    ఎంతో మంది భాగస్వాములైతే తప్ప ఓ సినిమా రూపొందించబడదు. తెరపై కనిపించే నటీనటులే గాక తెరవెనుక ఎంతో మంది ఆర్టిస్టుల కృషి ఉంటేనే ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో అవుట్ ఫుట్ వస్తుంది. అందుకే తమ సినిమాలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ టెక్నీషియన్స్ మొదలుకొని అందరికీ క్రెడిట్ ఇస్తుంటారు దర్శకనిర్మాతలు. అయితే కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ తెరవెనుక పని చేసిన ఆర్టిస్టుల క్రెడిట్ అస్సలు మర్చిపోరు హీరో హీరోయిన్లు. ఇటీవలే విడుదలైన అయోగ్య సినిమా విషయంలో ఇలాంటి ఓ ఉదంతం చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే..

    అయోగ్యలో రాశిఖన్నా

    అయోగ్యలో రాశిఖన్నా

    వెంకట్ మోహన్ దర్శకత్వంలో రూపొందిన అయోగ్య మూవీ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటించగా.. బొద్దుగుమ్మ రాశి ఖన్నా ఆయన సరసన ఆడిపాడింది. చిత్రంలో రాశి ఖన్నా పాత్రకు రవీనా డబ్బింగ్ చెప్పింది. అయితే టైటిల్ క్రెడిట్స్‌లో ఈమె పేరు పడకపోవటంపై రవీనా రియాక్ట్ అయింది.

    మాకు క్రెడిట్స్ ఇవ్వలేదంటూ

    మాకు క్రెడిట్స్ ఇవ్వలేదంటూ

    అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదు. షూటింగ్‌లో పాల్గొన్న డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్‌ ఇంజినీర్లు, స్టూడియో కో-ఆర్డినేటర్‌ల పేర్లు క్రెడిట్స్‌లో పేర్కొన్నందుకు సంతోషంగా ఉంది. కానీ మా డబ్బింగ్ కేటగిరీ పట్టించుకోనందుకు చాలా బాధగా ఉంది అంటూ రవీనా ట్వీట్ చేసింది.

    రాశిఖన్నా స్పందన

    నిన్ను గుర్తించనందుకు సారీ రవీనా. కానీ.. నీ మధురమైన స్వరంతో నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నీపై ఎంతో ప్రేమ ఉంది అని రవీనా ట్వీట్ పై రాశి ఖన్నా స్పందించింది. దీనిపై తిరిగి రవీనా రియాక్ట్ అవుతూ ధన్యవాదాలు రాశీ. మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్‌ పెట్టింది.

    టెంపర్ రీమేక్

    టెంపర్ రీమేక్

    తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన బ్లాక్‌‌బస్టర్‌ చిత్రం టెంపర్‌కు రీమేక్‌గా అయోగ్య రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది.

    Read more about: ayogya rashi khanna vishal
    English summary
    Rashi Khanna says sorry to the dabbing artist raveena. In Ayogya movie raveena gives dabbing to the rashi khanna voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X