For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రేకప్ తర్వాత రష్మికకు మళ్లీ లవ్ ప్రపోజల్.. ఆమె అంటే పిచ్చి అంటూ హీరో ట్వీట్

  |

  కన్నడ భామ రష్మిక మందన్న స్టార్ హీరోలతో జతకడుతూ తెలుగులో అగ్ర హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఇటీవల కాలంలో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొన్నది. అలాగే రాబోయే కాలంలో భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ, అలాగే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను మెరుగుపరుచుకొన్నది. ఈ క్రమంలో రష్మికకు తమిళ హీరో నుంచి ఓ లవ్ ప్రపోజల్ వచ్చింది. ఇంతకు ఆ హీరో ఎవరు.. ఎలాంటి ప్రపోజల్ చేశాడంటే..

  ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

  ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

  కిరిక్ పార్టీతో కన్నడ పరిశ్రమలోకి ప్రవేశించిన రష్మిక రికార్డు విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఆ తర్వాత హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి పెళ్లి వరకు వచ్చింది. ఆ తర్వాత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే కొన్ని పరిస్థితుల మధ్య రక్షిత్, రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటుంది.

   చలో తర్వాత స్టార్ హీరోయిన్‌గా

  చలో తర్వాత స్టార్ హీరోయిన్‌గా

  ఆ పరిస్థితుల్లో చలో సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఆ సినిమా విజయం సాధించడంతో ఇక వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత గీత గోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, డియర్ కామ్రేడ్, భీష్మ లాంటి సినిమాలతో భారీ విజయాలను చేజిక్కించుకొన్నది.

  దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా

  దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా

  ఇక ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో రష్మిక బిజీగా మారింది. అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రంలోను, ఇంకా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో సుల్తాన్, కన్నడలో పొగరు చిత్రాల్లో నటిస్తున్నది. ఇలాంటి సమయంలో, అదీ బ్రేకప్ తర్వాత రష్మికపై తమిళ హీరో హరీష్ కల్యాణ్ మనసు పడేసుకోవడం చర్చనీయాంశమైంది.

  రష్మిక అంటే క్రష్

  రష్మిక అంటే క్రష్

  కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ట్విట్టర్‌లో హరీష్ కల్యాణ్ చాట్ చేస్తుండగా.. ఓ అభిమాని ఏ హీరోయిన్ అంటే క్రష్ అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ దక్షిణాదిలో ప్రేక్షకులకు దేవతగా మారిన రష్మిక మందన్న అంటే నాకు క్రష్ అని చెప్పారు.

  రష్మికకు ట్యాగ్ చేసి

  అంతేకాకుండా తనకు రష్మిక అంటే పిచ్చి అంటూ చెప్పడమే కాకుండా ఆమె ట్విట్టర్ అకౌంట్‌కు స్వయంగా ట్యాగ్ చేయడంతో అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు. అయితే మీరంతా అంటే నాకు ఇష్టం. ఈ విపత్కర సమయంలో అందరూ క్షేమంగా ఉండాలి అని ట్వీట్ చేశారు.

  Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster
  హరీష్ కల్యాణ్ గురించి

  హరీష్ కల్యాణ్ గురించి

  హరీష్ కల్యాణ్ కెరీర్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ తమిళ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత 2018లో ప్యార్ ప్రేమ కాదల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం హిందీలో ఘన విజయం సాధించిన వికీ డోనర్ సినిమా రీమేక్ ధరల ప్రభు అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

  English summary
  Actress Rashmika Mandanna is going good in south film Industry. She had engagement breakup with Kannada Hero Rakshit Shetty. Now She gets love proposal from Harish Kalyan after breakup with Rakshit Shetty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X