'బిగ్'ట్రబుల్ లో మణిరత్నం?

ప్రపంచ వ్యాప్తంగా అలుముకుంటున్న అమెరికా ఆర్ధికమాధ్యం ఎఫెక్టు ఇది అని తెలుస్తోంది. ఈ మేరకు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఓ లెటర్ ని మణిరత్నానికి పంపారు. సినిమా బడ్జెట్ లో సగానికి సగం తగ్గించమని,కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత భరించలేనని దాని సారాంశం. తాము టై అప్ అయిన హాలీవుడ్ సంస్ధలు చేతులెత్తేసాయని వారు చెప్పినట్లు సమాచారం. ఇప్పుడాయన ఈ స్ధితిలో ఓ కొత్త నిర్మాతను వెతుక్కోవాలా బడ్జెట్ కోత భరించాలా అనే ఆలోచనలో తలపట్టుకు కూర్చున్నారు.
అసలు ఈ సినిమా ప్రారంభం నుండి రకరకాల సమస్యలు ఎదుర్కొంటోందనీ కేరళ అడవుల్లో ఫర్మిషన్ కాన్సిల్ చేసినప్పుడే మరొక్కసారి ఆలోచించవల్సిందని అప్పుడే సన్నాయినొక్కులు యూనిట్ లో బయిలు దేరారు.ఇక రిలయన్స్ వారు చేరన్ ఆటో గ్రాఫ్-2,హరి దర్శకత్వం వహిస్తున్న సూర్య హీరో సినిమా సింగం,ఫాజిల్ డైరక్షన్ సినిమాల మీద కూడా కోత వేస్తున్నారు. మరో ప్రక్క మర్మయోగి ఆగిపోవటం కూడా పరిశ్రమను ఆలోచనలో పడేస్తోంది.


Click it and Unblock the Notifications











