twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిగ్'ట్రబుల్ లో మణిరత్నం?

    By Staff
    |

    Maniratnam
    ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ లో దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో రావణ్ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుందని తద్వారా మణిరత్నం చాలా సఫరవ్వుతున్నాడని సమాచారం.

    ప్రపంచ వ్యాప్తంగా అలుముకుంటున్న అమెరికా ఆర్ధికమాధ్యం ఎఫెక్టు ఇది అని తెలుస్తోంది. ఈ మేరకు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న రిలియన్స్ బిగ్ పిక్చర్స్ వారు ఓ లెటర్ ని మణిరత్నానికి పంపారు. సినిమా బడ్జెట్ లో సగానికి సగం తగ్గించమని,కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంత భరించలేనని దాని సారాంశం. తాము టై అప్ అయిన హాలీవుడ్ సంస్ధలు చేతులెత్తేసాయని వారు చెప్పినట్లు సమాచారం. ఇప్పుడాయన ఈ స్ధితిలో ఓ కొత్త నిర్మాతను వెతుక్కోవాలా బడ్జెట్ కోత భరించాలా అనే ఆలోచనలో తలపట్టుకు కూర్చున్నారు.

    అసలు ఈ సినిమా ప్రారంభం నుండి రకరకాల సమస్యలు ఎదుర్కొంటోందనీ కేరళ అడవుల్లో ఫర్మిషన్ కాన్సిల్ చేసినప్పుడే మరొక్కసారి ఆలోచించవల్సిందని అప్పుడే సన్నాయినొక్కులు యూనిట్ లో బయిలు దేరారు.ఇక రిలయన్స్ వారు చేరన్ ఆటో గ్రాఫ్-2,హరి దర్శకత్వం వహిస్తున్న సూర్య హీరో సినిమా సింగం,ఫాజిల్ డైరక్షన్ సినిమాల మీద కూడా కోత వేస్తున్నారు. మరో ప్రక్క మర్మయోగి ఆగిపోవటం కూడా పరిశ్రమను ఆలోచనలో పడేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X