స్నేహాను అడ్డం పెట్టుకుని బాగానే బిజెనెస్ చేసారు
స్నేహకి తమిళంలో కొద్దో గొప్పో పేరు ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఆమె నటించిన అమరావతి చిత్రాన్ని మంచి రేటుకే తమిళ డబ్బింగ్ రైట్స్ ఇచ్చారని తెలుస్తోంది. అల్లరి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ చిత్రంగా భాక్సాఫీస్ వద్ద ఫలితం నమోదు చేసింది. అయితే కేవలం స్నేహను పోస్టర్స్ పై చూపి ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్ గా దీన్ని ప్రమోట్ చేస్తూ అంజుగమ్ టైటిల్ తో తమిళంలో రిలీజ్ చేయనున్నారు. సతష్ ఫిల్మ్ కార్పోరేషన్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తారకరత్న ఈ చిత్రంలో విలన్ గా చేసారు. త్వరలోనే ప్రమోషనల్ ఏక్టివిటీస్ ప్రారంభిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్నేహ గగ్గోలు ఎత్తుతోంది. తన క్రేజ్ ని అడ్డం పెట్టుకుని సినిమాను మార్కెట్ చేస్తున్నారని, రేపు ఆ సినిమా అటూ ఇటూ అయితే తన కెరీర్ కే నష్టం అవుతుందని ఆమె అంటోందిట. అందులోనూ అంతంత మాత్రంగా అవకాశాలు ఉన్న తాను ఇలాంటి ప్లాప్ సినిమాల డబ్బింగ్ వెర్షన్ తో మరింత నష్టపోనున్నట్లు ఆమె చెపుతోంది. కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, జి.వి.విశ్వనాథ్ కాశీ, రాఘవ, మధు తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి, కూర్పు: శంకర్, కళ: నారాయణరెడ్డి. పాటలు లేకపోవటం, తారకత్న విలనీ ఈ చిత్రానికి స్పెషల్స్.


Click it and Unblock the Notifications











