ఆ రీమేక్ తో రవితేజ తమిళ తెరకు పరిచయం కన్ఫర్మ్
రీసెంట్ గా హిందీలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన 'బ్యాండ్ బాజా బరత్' సినిమాను యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారు. ఆ చిత్రంలో హీరోగా రవితేజను కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.అలాగే ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. హిందీలో అనుష్క శర్మ పోషించిన పాత్రలో నటించడానికి త్రిషను ఎంపిక చేసుకున్నారు. గతంలో రవితేజ, త్రిష కాంబినేషన్ లో కృష్ణ అనే చిత్రం వచ్చి విజయవంతం అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా వంటి స్టార్స్ తమ తమిళ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్న నేపధ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం రవితేజ వీర చిత్రంలో చేస్తున్నారు. తాప్సీ, కాజల్ అతని సరసన హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











