రవితేజ, కమల్ హాసన్ కాంబినేషన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తూ, దర్శకత్వం వహించనున్న అమర్ హై చిత్రం లో రవితేజ కీ రోల్ ని పోషించనున్నారని తెలుస్తోంది. తమిళ,తెలుగు,మళయాళ,హిందీ భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రం కోసం ప్రతీ భాషకీ చెందిన నటులను ఈ చిత్రంలో తీసుకుంటున్నారు. అందులో భాగంగా తెలుగు నుంచి రవితేజ,మళయాళం నుంచి మోహన్ లాల్,తమిళం నుంచి అజిత్ ఇప్పటికి ఎంపిక అయ్యారు. హిందీ నుంచి ఎవరనేది తెలియటం లేదు. పంచతంత్రం సినిమా తరహాలో అన్ని భాషలకీ చెందిన వారిని ప్రాతినిధ్యం వహించే హీరోలతో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం నడుస్తుంది.
లంచగొండితనం,రాజకీయాలు నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టు ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తను డైరక్ట్ చేస్తున్న విశ్వరూపం అనంతంరం ఈ చిత్రాన్ని కమల్ రూపొందిస్తారు. ఈ చిత్రాన్ని దశావతారం నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం గురించి కమల్ మాట్లాడుతూ...రాజకీయం అంటే డబ్బు సంపాందించే సాధనంగానే సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ సమాజంలో, రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతి అంశాల ఆధారంగా 'అమర్ హై' చిత్రం వుంటుంది. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న మోసాల్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











