twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ్ లో 'మొరట్టుసింగం'గా రవితేజ

    By Srikanya
    |

    చెన్నై : తెలుగులో మాస్ మహరాజగా వెలుగుతున్న రవితేజ త్వరలో తమిళంలో 'మొరట్టుసింగం' గా అలరించనున్నాడు. రవితేజ హీరోగా నటించిన చిత్రం మిరపకాయ్ చిత్రం తమిళంలోకి డబ్బింగ్ అవుతోంది. దీక్షాసేత్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. దాంతో ప్యాన్సీ రేటుకే తమిళంలో తీసుకుని డబ్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా తమిళంలో రిచాకు మంచి మార్కెట్ ఉంది. దాంతో ఆమెనే హైలెట్ చేయనున్నారు.

    కథ ప్రకారం...విద్రోహ శక్తిగా మారిన ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీసు అధికారి అయిన హీరో ఢిల్లీ నుంచి చెన్నై వస్తాడు. ఆ నేరస్తుడి కూతురునే ప్రేమిస్తున్నట్లు నటించి అతని నేరసామ్రాజ్యానికి ఎలా చరమగీతం పాడాడు? అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మొరట్టు సింగం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందించారు. ఛాయాగ్రహణం వరప్రసాద్, మాటలు - ఏఆర్‌కే రాజరాజా అందించారు. ప్రకాష్‌రాజ్, స్వాతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అమృతా మూవీ మేకర్స్ పతాకంపై రాజవంశి తమిళంలోకి అనువదిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి

    అలాగే రవితేజ త్వరలో 'బుల్లెట్ రాజా' గా కనిపించి అలరించనున్నారు. అయితే తెలుగు తెరపై కాదు..తమిళ తెరపై ..రవితేజ ఈ టైటిల్ తో కనిపించనున్నారు. రవితేజ..హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన దరువు చిత్రం బుల్లెట్ రాజా టైటిల్ తో తమిళంలో విడుదల కానుంది. ఈ మేరకు చెన్నై డబ్బింగ్ వర్క్ ప్రారంభమైంది. తమిళంలో కార్తీతో విక్రమార్కుడు రీమేక్ సిరుతై చిత్రం రూపొందించిన శివ దర్శకుడు కావటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. అందులోనూ ఈ చిత్రానికి అరవ వారస ఎక్కవ ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. తాప్సీ, యముడుగా చేసిన ప్రభు అక్కడ బాగా తెలిసి ఉన్నవారు కావటంతో మంచి బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.

    ఇంతకుముందు రవితేజ,కాజల్ మరియు తాప్సీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం "వీర" తమిళంలోకి అనువదించి రిలీజ్ చేసారు.ఈ చిత్రానికి "వీరయ్య" అనే పేరు పెట్టారు. తెలుగులో ఫ్లాప్ అయినా ఈ చిత్రంలో కాజల్ మరియు తాప్సీ లాంటి హీరోయిన్స్ కు తమిళనాడులో పేరొందడం మూలాన ఈ చిత్రం డబ్బింగ్ హక్కులను ఒక తమిళ నిర్మాత కొనుక్కుని ఆగస్ట్ 3న విడుదల చేసారు. అక్కడా ఆ సినిమా ఆడలేదు.

    English summary
    
 The trend now is the release of dubbed films are catching up these days in Kollywood. After Business Man , another Telugu film titled Mirapakai will be released as Murattu Singam in Tamil. The film has Richa Gangopadhyay, Ravi Teja and Deeksha
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X