మాస్ మహరాజా ‘వీర’ సరసన కాజల్ అదరహో...
హిట్ మీద హిట్ కొడుతూ ఎప్పటికప్పుడు తన సత్తా చూపిస్తున్న మాస్ మహారాజా రవితేజ హీరోగా 'రైడ్" వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ దర్శకత్వంలో శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'వీర".
ఇది రవితేజ నటిస్తోన్న మరో పక్కా మాస్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రను చేస్తున్నాడు. మామూలుగా ఆయన ఒక పాత్ర చేస్తేనే ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ లభిస్తుంది. ఇక రెండు షేడ్స్ ఉన్న పాత్ర అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. రవితేజ సరసన కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ రచన చేస్తున్నారు. పరుచూరి వారి కలానికి ఉన్న పవర్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ నటించిన 'కిక్, మిరపకాయ్" చిత్రాలకు హిట్ సాంగ్స్ అందించిన తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











