రవితేజ చిత్రానికి 'బుల్లెట్ రాజా' టైటిల్ ఖరారు
చెన్నై: రవితేజ త్వరలో 'బుల్లెట్ రాజా' గా కనిపించి అలరించనున్నారు. అయితే తెలుగు తెరపై కాదు..తమిళ తెరపై ..రవితేజ ఈ టైటిల్ తో కనిపించనున్నారు. రవితేజ..హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన దరువు చిత్రం బుల్లెట్ రాజా టైటిల్ తో తమిళంలో విడుదల కానుంది. ఈ మేరకు చెన్నై డబ్బింగ్ వర్క్ ప్రారంభమైంది. తమిళంలో కార్తీతో విక్రమార్కుడు రీమేక్ సిరుతై చిత్రం రూపొందించిన శివ దర్శకుడు కావటంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. అందులోనూ ఈ చిత్రానికి అరవ వారస ఎక్కవ ఉండటం కూడా కలిసి వచ్చే అంశం. తాప్సీ, యముడుగా చేసిన ప్రభు అక్కడ బాగా తెలిసి ఉన్నవారు కావటంతో మంచి బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.
బూరుగుపల్లి శివరామకృష్ణ శ్రీ వెంకటేశ్వర ఎంట ర్‌టైన్‌మెంట్ పతాకంపెై నిర్మించిన సినిమా 'దరువు'. 'సౌండ్ ఆఫ్ మాస్' అనేది ఉపశీర్షిక. రవితేజ హీరో. తాప్సీ కథానాయిక. శివ దర్శకుడు. కామిడీ ప్రధానంగా యమలోకం నేపధ్యంలో సాగే ఈ 'దరువు చిత్రంలో రవితేజ ..బుల్లెట్ రాజా అనే పాత్రలో కనిపిస్తారు. అతని సరసన తాప్సీ ..శ్వేత అనే భరతనాట్య కళాకారణి గా అలరిస్తుంది. పక్కా మాస్ ఎంటర్టనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బ్రహ్మానందం చేసిన విద్యాబాలన్ పాత్ర హైలెట్ గా ఉంటుంది.
కథలో బుల్లెట్ రాజా (రవితేజ)... పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది అతని వాలకం. ఏం చేసినా నలుగురికి తెలియాలంటాడు. చాలా సరదా మనిషి. ఏ పనైనా వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తాడు. అలాంటి కుర్రాడికి శ్వేత (తాప్సి) అనే భరతనాట్య కళాకారిణితో పరిచయమవుతుంది. బుల్లెట్ రాజా ఉన్నట్టుండి హోం మంత్రి ఎలా అయ్యాడు? యమలోకానికి వెళ్లి ఎలా తిరిగొచ్చాడు? అనే పాయింట్ చుట్టూ కథ తిరుగతుంది.
దర్శుకుడు ఈ చిత్రం తమిళ వెర్షన్ గురించి మాట్లాడుతూ..''అవినీతిపెై వేసే దరువు ఇది. సమకాలీన రాజకీయాలను పరిధుల్లో చూపిస్తూ..పూర్తి స్థాయి వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. హీరో బుల్లెట్‌రాజా ప్రవర్తనకు తగ్గ టైటిల్ ఇది. రవితేజ హీరోయిజం ఎలివేట్ చేస్తుంది. యమలోకం నేపథ్యమూ కథలో ఇమిడి ఉంది. 30ఏళ్ల నుంచి యమ నేపథ్యంలో వచ్చిన సినిమా లకు భిన్నంగా దీనిని తీర్చిదిద్దాం. కథనాన్ని దర్శకుడు చాలా కొత్తగా నడిపించాను. రవితేజ ఐదు విభిన్న వేషాల్లో అలరిస్తాడు అన్నారు. తెలుగులో ప్లాఫ్ అయిన ఈ చిత్రం తమిళంలో ఏమౌంతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











