విశాల్‌కు అలాంటి భయం .. వివాదంపై అసలు గుట్టు విప్పిన సీనియర్ నిర్మాత

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విశాల్ మరొక వివాదంతో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాతతో ఋణం విషయంలో తేడా రావడంతో ఆ విషయంపై విశాల్ పోలీసు కేసు కూడా నమోదు చేశాడు. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆ వార్త వైరల్ అవ్వడంతో చివరికి ఆ నిర్మాత స్పంధించక తప్పలేదు. విశాల్ భయపడుతున్నట్లు ఉన్నాడని ఆయన వివరణ ఇచ్చారు.

 వాటిని పెద్దగా పట్టించుకోకుండా

వాటిని పెద్దగా పట్టించుకోకుండా


హీరో విశాల్ ఇటీవల కాలంలో తన సినిమాలతోనే కాకుండా ఇతర అంశాలపై కూడా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే విధంగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ విశాల్ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తన స్టైల్ లోనే వెళుతున్నాడు. అయితే గతంలో మాదిరిగా మాత్రం అతను హిట్స్ అందుకోవడం లేదు.

పోలీస్ కేసు నమోదు

పోలీస్ కేసు నమోదు

ఇటీవల నిర్మాత ఆర్బీ.చౌదరి అప్పు తీర్చననప్పటికి చెక్ లీవ్స్, బాండ్స్ & ప్రామిసరీ నోట్స్‌ను తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారని విశాల్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. అలాగే నిర్మాతపై పోలీసు కేసు కూడా నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

విశాల్ డబ్బు తీసుకున్నాడు

విశాల్ డబ్బు తీసుకున్నాడు


ఇక ఈ వివాదం మరింత ముదరకముందే నిర్మాత ఆర్బీ.చౌదరి క్లారిటీ ఇచ్చేశారు. ఇరుంబు తిరై (అభిమన్యుడు) సినిమా కోసం విశాల్ కొంత అప్పు అడిగినప్పుడు నేను అలాగే తిరుప్పూర్‌ సుబ్రహ్మణ్యం కొంత డబ్బు ఇచ్చాము. అప్పుడు ప్రామిసరి నోట్స్ కూడా రాయించడం జరిగింది. ఇక విశాల్ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చినప్పుడు తాము ఓ డాక్యుమెంట్ పై సంతకాలు చేశాము.

 చాలా చిన్న విషయం

చాలా చిన్న విషయం


ఇక తీసుకున్న అప్పుకు సంబంధించిన కాగితాలు శశికుమార్ కు ఇవ్వగా అతను రీసెంట్ గా మృతి చెందాడు. దీంతో ఆ పేపర్లు అతను ఎక్కడ దాచాడు అనే విషయం ఎవరికి తెలియలేదు. అదే విషయాన్ని విశాల్ కు వివరించాము. కానీ అతను వినలేదు. ఆ పేపర్లు అన్ని నా వద్ద ఉన్నాయని భవిష్యత్తులో ఏదైనా మోసానికి పాల్పడవచ్చని విషాల్ బయపడుతుండవచ్చని ఆర్బీ చౌదరి వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా ఇది చాలా చిన్న విషయమని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X