రామ్ చరణ్ పై పడి ఏడుస్తున్న తమిళ హీరోలు!?
'మగధీర" తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని భాషల పరిశ్రామలని ఆకర్షించిన మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ మలి చిత్రంపై అప్పుడే ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. 'మగధీర" సినిమాని రీమేక్ చేయడం కూడా కష్టమనేంతగా తెరకెక్కించడంతో దానిలో నటించే అవకాశం కోల్పోయిన ఇతర భాషల హీరోలు చెర్రీ తదుపరి చిత్రం పై దృష్టి పెట్టారు. మన హిట్ సినిమాలను ఇమ్మీడియట్ గా రీమేక్ చేసే తమిళ హీరోలు విజయ్, జయం రవి..ఇప్పటికే రామ్ చరణ్ తదుపరి సినిమా గురించి వాకబు చేస్తున్నారు. భాస్కర్ డైరెక్షన్ లో రూపొందే ఈ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయడానికి అప్పుడే పోటీలు పడుతున్నారు. విజయ్ అయితే తనకు తెలిసిన నిర్మాతల చేత అడ్వాన్స్ బుకింగ్ కూడా చేయించేసుకుంటున్నాడని తమిళ మీడియాలోనే వార్తలొస్తున్నాయి. 'మగధీర" వంటి చారిత్రాత్మక సినిమా తర్వాత వస్తోన్న సినిమా కనుక ఏ విషయంలోను రాజీ పడకూడదని ఇప్పటికే ఈ చిత్ర రూపకర్తలు అన్ని విషయాలపై అధిక శ్రద్ధ వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











