పెళ్లి చేసుకోమంటూ...నటి కుమార్తెకు వేధింపులు,పోలీస్ అరెస్ట్

By Srikanya

చెన్నై: అలనాటి నటి కేఆర్ విజయ కుమార్తెను వివాహం చేసుకోమని వేధింపులకు గురి చేస్తున్న రియల్ ఎస్టేట్ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళ,తెలుగు భాషల్లో నటించి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు కె.ఆర్ విజయ.

ఆమె కుమార్తె హేమలత(47) కోవై అవినాశిరోడ్డు లక్ష్మిమిల్ జంక్షన్ సమీపంలోని అపార్టుమెంట్‌లో నివసిస్తోంది. అభిప్రాయబేధాల కారణంగా భర్త నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విదేశాలలో నివసిస్తున్నారు.

ఓ రోజున హేమలత ఫోన్‌కు పాపనాయగన్ పాళయంకు చెందిన కదిరవేల్(45) అనే అతడు ఫోన్‌చేసి తాను రియల్ ఎస్టేట్ యజమాని అని పరిచయం చేసుకున్నాడు. అలాగే , స్థలం కొనాలంటే తనను సంప్రదించవచ్చునని చెప్పాడు. అంతటితో ఆగకుండా.. ఆ తరువాత స్థలానికి సంబంధించి మాట్లాడడానికి కదిరవేల్ హేమలత ఇంటికి వచ్చాడు.

Realtor held for harassing K R Vijaya' daughter

హేమలత ఒంటరిగా ఉంటున్న విషయం తెలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరారు. ఆ తరువాత తరచూ హేమలతతో సెల్‌ఫోన్‌లో మెసేజ్ పంపేవాడు. దీనికి హేమలత వ్యతిరేకత తెలిపింది. కదిరవేల్ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు.

అంతేకాకుండా...ఇటీవల ఆమెను కలుసుకున్న కదిర్‌వేల్ కేఆర్ విజయ కుటుంబంలో ఎవరినైనా వివాహం చేసుకోవాలన్నదే తన చిరకాల వాంఛ, మీరు కాకపోతే కేఆర్ విజయ సోదరి కుమార్తె అయినా ఫర్వాలేదు నాకు ఇచ్చి పెళ్లి చేయండి, దీని కోసం నా భార్యకు విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని వేధించసాగాడు. దీంతో హేమలత షాక్ అయ్యింది.

దీనిపై కోయంబత్తూరు రేస్‌కోర్సు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మహిళా వేధింపుల నివారణ చట్టం కింద కదిర్‌వేల్‌ను అరెస్టు చేశారు. తదుపరి అతడిని కోయంబత్తూరు న్యాయస్థానంలో హాజరు పరచి జైలుకు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X