Vijayakanth విజయ్‌కాంత్‌ మరణానికి కారణం ఏమిటో తెలుసా? డాక్టర్లు చెప్పినది ఏమిటంటే?

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఇక లేరు. గత కొద్ది సంవత్సరాలుగా పలు రకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇటీవల న్యూమోనియా వ్యాధితో హాస్పిటల్‌లో చేరిన ఆయన కొద్ది రోజులు చికిత్ప పొందిన అనంతరం కోలుకొన్నట్టు కనిపించారు. కానీ ఆయనకు కరోనా వైరస్ బారిన పడ్డారు. దాంతో వెంటనే చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌ యోట్‌లో చేర్పించారు. ఆయన వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

Recommended Video

Vijayakanth ప్రాణం తీసింది అదే.. Doctors చెప్పిందేంటంటే | RIP Captain Vijaykanth | Telugu Filmibeat

గత కొద్ది రోజులుగా విజయ్‌కాంత్ అనారోగ్యంపై అనేక రూమర్లు వచ్చాయి. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారంటూ పార్టీ వర్గాలు ప్రకటనల ద్వారా ఊహాగానాలను కొట్టిపడేశారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతూనే వచ్చారు. అయితే ఇటీవల కాలంలో విజయ్ కాంత్ ఆరోగ్యం మరింత విషమించింది.

Reason behind Captain Vijaykanth Death: Here is complete story of Tamil actor turned politician

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మరోసారి కరోనా వైరస్ మరోసారి విజృంభించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన విజయ్‌కాంత్‌‌కు కరోనా వ్యాధి ప్రాణాంతకంగా మారింది. ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయనను హుటాహుటినా హాస్పిటల్‌కు తరలించారు. అయితే పార్టీ వర్గాలు మాత్రం రెగ్యులర్ చెకప్ అని వివరణ ఇచ్చారు.

అయితే కరోనా వైరస్ కారణంగా విజయ్‌కాంత్‌కు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Reason behind Captain Vijaykanth Death: Here is complete story of Tamil actor turned politician

విజయ్‌కాంత్ మరణాన్ని హాస్పిటల్ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. కెప్టెన్ విజయ్‌కాంత్ ఇకలేరు. న్యూమోనియాతో హాస్పిటల్‌లో చేరారు. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాం. ఆయన డిసెంబర్ 28 తేదీన తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రకటనలో తెలిపారు.

విజయ్‌కాంత్ కెరీర్ విషయానికి వస్తే.. సుమారుగా 150 చిత్రాల్లో ఆయన నటించారు. అనంతరం ఆయన డీఎండీకే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011 నుంచి 2016 వరకు ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X