శంకర్ పతనానికి కారణం అతడేనా? ఇండియన్ 2 డిజాస్టర్ వెనక అసలు స్టోరీ అదేనా?
ఇండియా సినిమా రంగంలో సమాజంలోని అసమానాతలను, రాజకీయ నేతల అవకతకవలపై సినీ విమర్శనాస్త్రాలు సంధించి తనదైన శైలిలో విజయాలు అందుకొన్న దర్శకుడు శంకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుస పరాజయాలతో ఎన్నడూలేని విధంగా విమర్శలను, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన నుంచి వస్తున్న డిజాస్టర్ సినిమాలకు కారణం తన టీమ్‌లోని కీలక సభ్యుడు లేకపోవడమేనా? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరు? శంకర్ కెరీర్ గ్రాఫ్‌పై దెబ్బేసిన ఆ ప్రముఖుడు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
శంకర్ సినిమా కెరీర్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో జైత్రయాత్రగా మొదలైంది. ఆయన దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన జెంటిల్మన్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు సినిమా లవ్ స్టోరీల్లో ఓ ట్రెండ్ సెట్టర్. ప్రభుదేవాను హీరోగా పరిచయం చేసి పాటలతో యూత్‌కు కిర్రాక్ ఎక్కించిన ఆయన స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయారు.

ఇక కమల్ హాసన్ హీరోగా ఇండియన్ సినిమా విజయం మరో సంచలనం. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన జీన్స్ సినిమా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐశ్వర్య రాయ్‌తో తీసిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. ఆ తర్వాత అపరిచితుడు, శివాజీ, రోబో సినిమాలు ఆయనకు మరో రేంజ్‌ను తెచ్చిపెట్టాయి.
అయితే ఎప్పుడైతే 2 ఇడియెట్స్ సినిమాను రీమేక్‌గా నాంబన్ తీశాడో అక్కడి నుంచే ఆయన పతనం మొదలైంది. ఐ మూవీ దెబ్బేయడంతో కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత 2.0 ఫర్వాలేదనిపించినా.. తన రేంజ్ సినిమా కాదని ప్రేక్షకులు తేల్చేశారు. ఇండియన్ 2 సినిమా శంకర్‌కు ఉన్న గౌరవాన్ని కిందపడేసేలా చేసింది. తాజాగా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా పెద్దగా మెప్పించలేకపోవడంతో ఈ స్టార్ డైరెక్టర్ భవిష్యత్ అంధకారంలో పడేసింది.

అయితే శంకర్ సినిమాలు డిజాస్టర్లు, ఫ్లాప్‌లుగా మారడానికి కారణం ఆయన టీమ్‌లో కథ, కథనాలపై పట్టు సాధించే సుజాత రంగరాజన్ లేకపోవడమే అనే వాదన మొదలైంది. రచయిత సుజాత ఉన్నంత కాలం శంకర్ ఖాతాలో విజయాలకు కొదవలేదు. సుజాత మరణం తర్వాత ఆ స్థాయి రచయిత శంకర్‌కు లభించడకపోవడంతో జడ్జిమెంట్ మిస్ అవుతున్నాడనే వాదన వినిపిస్తున్నది. ఇక ముందైనా శంకర్ తన స్థాయి ఏంటో నిరూపించుకొంటాడని ఆశిద్దాం.
సుజాత రంగరాజన్ కెరీర్ విషయానికి వస్తే.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాకు కథను ఆయనే అందించారు. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన రోజా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్, ముదాల్వన్, బాయ్స్, శివాజీ: ది బాస్, ఎంథిరన్ సినిమాలకు పనిచేశారు. సినీ పరిశ్రమలో తనదైన గౌరవాన్ని సంపాదించుకొన్న సుజాత రంగరాజన్.. గుండె సంబంధిత, అలాగే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతూ 2008లో కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











