300 కోట్ల మూవీని వదులుకొన్న యాక్టర్ డైరెక్టర్.. సూపర్ హీరో మూవీ ఎందుకు మిస్ చేసుకొన్నాడో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాకి ఎలాంటి హద్దు లేదు. ఈ జానర్ ఆ జానర్ అని లేకుండా మనం చూడని ఎన్నో కొత్త కొత్త విషయాలు సినిమా ద్వారా మేకర్స్ మనకి చూపిస్తూ ఇస్తారు. అయితే హాలీవుడ్ మార్కెట్ లో ఇప్పటికే చాలా జానర్స్ ఎక్స్ ప్లోర్ అయ్యి ఆడియెన్స్ కి మంచి థ్రిల్ ని ఇచ్చినవి చాలా ఉన్నాయి. అలా యూనివర్సల్ గా హిట్ అయ్యిన కొన్ని క్రేజీ జానర్స్ లో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి.
కాగా ఈ జానర్ లో మన దేశపు సినిమా నుంచి కొంచెం తక్కువ సినిమాలే కనిపిస్తాయి అని చెప్పాలి. హిందీ నుంచి "క్రిష్" అందరికీ బాగా తెలుసు. తమిళ్ నుంచి "రోబో" ఉంది రీసెంట్ గా యంగ్ హీరో హిప్ హాప్ తమిళా నటించిన "వీరన్" ఉంది. అటు మలయాళ సినిమాలో కూడా "మిన్నల్ మురళి" ఉన్నాడు. కానీ మన తెలుగు సినిమా నుంచి సూపర్ హీరో సినిమా లేదు. వచ్చాడు యంగ్ దర్శకుడు తన "హను మాన్" తో.

యువ హీరో తేజ సజ్జని తన సూపర్ హీరోగా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా తెలుగు నుంచి వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో సినిమాగా వచ్చి వచ్చిన మొదటి సినిమాగా పైన చెప్పిన అన్ని సినిమాల కంటే భారీ వసూళ్లు అందుకుని అదరగొట్టింది. ఏకంగా 300 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకుంది. కాగా ఈ చిత్రంలో చాలా మంది ముఖ్య నటులు కనిపించారు కానీ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ని వెర్సటైల్ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య మిస్ చేసుకున్నాడట.
ఇపుడు ఎస్ జె సూర్య నటుడుగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తెలుగులో లేటెస్ట్ గా సరిపోదా శనివారంలో ఒక దయ లేని పోలీస్ గా కనిపిస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని రివీల్ చేసాడు. హను మాన్ లో మొదట ఓ రోల్ కోసం ఎస్ జె సూర్యని అనుకున్నాడట కానీ రెమ్యునరేషన్ పొంతన కుదరక తమ కాంబినేషన్ ఆగిపోయింది అన్నట్టుగా అసలు విషయం చెప్పేసాడు.

కాగా ఎస్ జె సూర్య ఆ సినిమాలో మిస్ చేసుకున్న ఆ రోల్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే తాను చేయగలిగే రోల్స్ ఆ సినిమాలో రెండే రెండు ఉన్నాయి. ఎస్ జె సూర్యలో ఒక స్పెషాలిటీ ఉంది. తాను ఇప్పటికీ యంగ్ గా కనిపించగలడు అలాగే వయసైన విలన్ గా కూడా కనిపించగలడు.
ఇలా చూస్తే హను మాన్ లో తాను చేసుంటే నటుడు సముద్రఖని చేసిన విభీషణ పాత్ర కానీ లేదా అదే తమిళ నటుడు వినయ్ రాయ్ రోల్ తాను చేసి ఉండొచ్చు. కానీ ఎక్కువమంది అయితే సముద్రఖని రోల్ కే మొదటిగా ఎస్ జె సూర్యని అనుకున్నారని అంటున్నారు. అదే రెమ్యునరేషన్ సెట్టవ్వక మారింది అని టాక్.


Click it and Unblock the Notifications











