మీనా భర్త మరణం వెనుక కారణం ఇదే.. అసలు విషయాన్ని బయటపెట్టిన సీనియర్ నటి
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం సినీ వర్గాలు, సినీ ప్రేక్షకులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. జూన్ 30వ తేదీ గురువారం ఆయన చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 48 సంవత్సరాలు. అయితే విద్యాసాగర్ మరణం తర్వాత అనేక రూమర్లు, కథనాలు రావడంపై సీనియర్ నటి కుష్బూ స్పందిస్తూ..

మీనా భర్త ఆరోగ్యంపై రూమర్లు
అయితే మీనా భర్తకు మూడు నెలల క్రితం కోవిడ్ 19తో బాధపడ్డారు. ఆ సమయంలో ఆయన ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆ కారణంగా ఆయన మరణించారు అని, అలాగే పావురాల రెట్టల కారణంగా ఆయన ఊపిరితిత్తులు పాడైపోయాయి అనే కథనాలు, రూమర్లు మీడియాలో వైరల్ అయ్యాయి.

ఊపిరితిత్తులు వ్యాధితో
ఇలాంటి వార్తల గురించి కుష్బూ ఖండించారు. విద్యాసాగర్ మరణవార్త వినగానే తీవ్ర విషాదంలో మునిగిపోయాను. సుదీర్ఘకాలంగా విద్యాసాగర్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఓ దశలో ఊపిరితిత్తుల మార్పిడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది వీలు కాలేదు అని కుష్బూ పేర్కొన్నారు.

మెడిసిన్స్ పనిచేయకపోవడంతో
విద్యాసాగర్ ఊపిరితిత్తుల మార్పిడి కోసం వైద్యులు ప్రయత్నించారు. కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్ లభ్యమైతే ఆ సర్జరీ చేయాలని అనుకొన్నారు. కానీ అలాంటి పేషెంట్ లభించకపోవడంతో మెడిసిన్స్ ద్వారా నయం చేసేందుకు ప్రయత్నించారు. కానీ మెడిసిన్ ద్వారా ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు అని కుష్భూ తెలిపారు.

సరైన సమాచారంతో కథనాలు రాయండి
విద్యాసాగర్ మరణం వెనుక కారణాలను తెలుసుకొని సరైన రీతిలో కథనాలు రాయండి. అంతేగానీ.. పావురాల కారణంగానో లేదా కోవిడ్ కారణంగానో మరణించారని రాయకండి. ఆయన ఈ లోకాన్ని వీడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇలాంటి కథనాలతో వారిని మరితం బాధపెట్టకండి అని కుష్బూ కోరారు.

మీనా దాంపత్య జీవితం గురించి
పెద్దలు కుదర్చడంతో మీనా, విద్యాసాగర్ వివాహం 2009లో జరిగింది. వారికి నైనిక అనే కూతురు ఉన్నారు. మీనా కూతురు విజయ్ నటించిన ఓ చిత్రంలో బాలనటిగా కనిపించడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే విద్యాసాగర్ మరణంతో మీనా, నైనిక ఒంటరిగా మారిపోయారు. తీవ్ర విషాదంలో ఉన్న మీనాను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications











