అతి ప్రేమే కొంప ముంచింది
తన కుమారుడు సెల్వరాఘవన్, సోనియా అగర్వాల్ తో విడిపోతుండటానికి కారణం వారిద్దరి మధ్య వున్న అతి ప్రేమే కారణం అంటున్నారు కస్తూరి రాజా. సెల్వరాఘవన్-సోనియాలు ప్రేమించుకొంటున్నారని తొలుత మీడియాకు చెప్పడమే కాకుండా, వారిద్దరి ప్రేమ పెళ్లిగా మారడానికి కీలకపాత్ర పోషించిన కస్తూరి రాజా, ఇప్పుడు వారిద్దరూ విడిపోతుండటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
విడాకులకు దరఖాస్తు చేసుకోవడానికి రెండు రొజుల ముందు జరిగిన తన పుట్టినరోజు వేడుకకు కూడా వాళ్లిద్దరూ కలసి వచ్చారనీ, ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు కనిపించారని చెప్పారు. వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమని, ఆ ప్రేమే ఇప్పుడు వారి కొంపముంచిందని విచారం వ్యక్తం చేసారు. మా అబ్బాయి నుండీ విడాకులు తీసుకున్నా సోనియాను తన కుమార్తెలాగే ఆదరిస్తానని చెప్పడం విశేషం.
More from Filmibeat
selva raghavan sonia agarwal kasthuri raja danush aayirathil oruvan rajinikanth సెల్వరాఘవన్ సోనియా అగర్వాల్ కస్తూరి రాజా ధనుష్


Click it and Unblock the Notifications











