For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  త్రిష బ్రేకప్ కి కారణం ధనుష్? నిజమే అంటున్నారు, అసలు ఆ రోజు ఏం జరిగింది?

  By Srikanya
  |

  చెన్నై: 2015లో నిర్మాత వరుణ్‌ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మేలో వీరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇదిలా ఉండగా త్రిష ఇటీవల ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అయితే ఆమె మాట్లాడిన మాటలు తర్వాత రకరకాల కథనాలు మీడియాలో ప్రత్యక్ష్యమయ్యాయి. అందులో ఒకటి ధనుష్ వల్లే ఆమె బ్రేకప్ అని.

  అందులో పెళ్లికి సంబంధించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నన్ను పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి.. సినిమాల నుంచి తప్పుకోవాలంటూ నాకు షరతు విధించారు. కానీ ఆ విషయాన్ని నేను తట్టుకోలేక పోయా. అందువల్లే పెళ్లినే ఆపేశా. నా ఆఖరి శ్వాస ఉన్నంత వరకు సినిమాల నుంచి పక్కకు వెళ్లనని చెప్పారు.

  అయితే వీరి బ్రేక్ అప్ కు మీడియాలో రకరకాల కారణాలు మీడియాలోనూ, తమిళ పరిశ్రమలోనూ వినపడుతున్నాయి. అయితే ఆ మధ్యన ఓ కొన్ని ముఖ్యమైన కారణాలను తమిళ మీడియా ముందుకు తీసుకొచ్చింది. అవేమిటంటనేది క్రింద చదవండి.

  ట్విట్టర్ వార్

  ట్విట్టర్ వార్

  త్రిష..ఫియాన్సి వరుణ్, త్రిష లు బ్రేకప్ అయినట్లే అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు రీసెంట్ గా ట్వీట్ల వార్ ప్రారంభమై అది తిట్టుకోవటంతో ...పరాకాష్టకు చేరింది. అప్పుడే జనాలకు అర్దం అయ్యింది. వీరిద్దరూ విడిపోయే పోగ్రాం పెట్టుకున్నారని.

  కంటిన్యూ అవటం ఇష్టం లేదు

  కంటిన్యూ అవటం ఇష్టం లేదు

  వరుణ్ తల్లి తండ్రులకు...ఆమె సినిమాల్లో కంటిన్యూ అవటం ఇష్టం లేదు..ముఖ్యంగా ఎంగేజ్మెంట్ అయ్యాక. అయితే తర్వాత ఆమె వరసగా సినిమాలు ఒప్పుకోవటం విభేధాలకు దారి తీసింది. దీనిపై వరుణ్, త్రిష ల మధ్య పెద్ద గొడవలే జరిగాయంటున్నారు.

  ధనుష్ ని పిలవటం

  ధనుష్ ని పిలవటం

  అలాగే ఎంగేజ్మెంట్ పార్టికి...త్రిష...ధనుష్ ని పిలవటం ..వరుణ్ కు ఇష్టం లేదు. ఇద్దరి మధ్యా గతంలో విభేదాలు ఉన్నాయి. అయితే త్రిష వాటిని ప్రక్కన పెట్టి ధనుష్ ని పిలవటం అతనికి చిరాకు తెప్పించింది అంటున్నారు. ఇప్పుడు ధనుష్ తో ఆమె సినిమా సైతం చేసింది.

  కంట్రోలు చేస్తున్నాడనా..

  కంట్రోలు చేస్తున్నాడనా..

  ఇక త్రిష ఏమని ఫీలైందంటే...వరుణ్ ..ఎంగేజ్ మెంట్ అయ్యిన నాటి నుంచీ...ఓ కంట్రోల్ ఫ్రీక్ లాగ బిహేవ్ చేస్తున్నాడని..అంటే తనను కంట్రోలు చేయటానికి ప్రయత్నిస్తున్నాడని ... దీనికి వరుణ్ కూడా హర్టయ్యారు. ఆయన సైతం ఈ విషయం సీరియస్ గా తీసుకుని త్రిషపై ఇలా అంటావా అని విరుచుకు పడ్డారని తెలుస్తోంది.

  డిలేట్ చేసిన ట్వీట్ తో ..

  డిలేట్ చేసిన ట్వీట్ తో ..

  అప్పట్లోనే వరుణ్ ట్వీట్ చేస్తూ..పేరు ప్రస్తావించకుండా స్లట్ అన్నాడు. కాస్సేపటికే త్రిష అతన్ని ట్విట్టర్ లో అన్ ఫాలో అయ్యింది. దాంతో అందరూ ..వరుణ్ అన్నది త్రిషే అనే ఉద్దేశానికి వచ్చేసారు. కాకపోతే కాస్సేపటికి...స్లట్ అని పెట్టిన ట్వీట్ ని డిలేట్ చేసేసాడు. అయితే అప్పటికే జరగవలిసిన డామేజ్ జరిగిపోయింది. ఈ ట్వీట్ అన్ని మీడియాల్లోకి పాకేసింది.

  రాజీ పడ్డా..త్రిష ..నో

  రాజీ పడ్డా..త్రిష ..నో

  ఈ నేపధ్యంలో వీరి సన్నిహితులు ముందుకు వచ్చి...వీరిని కలిపే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. చిన్న చిన్న అభిప్రాయ భేధాలు ఎవరి మధ్య అయినా సహజమేనని, సర్దుకుపోవాలని రాజీ చేయటానికి ప్రయత్నించిన్నట్లు చెప్పుకుంటున్నారు. వరుణ్ మణియన్ ...రాజీకు ఇష్టపడినా, త్రిష మాత్రం పట్టుదలగా ఉండటమే పూర్తి బ్రేకప్ కు కారణం అయ్యిందని అంటున్నారు.

  ఎన్నో రోజులు కూడా మురెపం లేదు

  ఎన్నో రోజులు కూడా మురెపం లేదు

  త్రిష.. చిత్ర నిర్మాత వరుణ్‌ మణియన్‌తో ప్రేమాయణం సాగించి, నిశ్చితార్థం చెన్నైలో క్రితం సంవత్సరం ఏడాది జనవరి 23న జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, స్నేహితులకు ఓ నక్షత్ర హోటల్‌లో విందు కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజులుకే కొన్ని ప్రముఖ తమిళ పత్రికలు వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు ప్రచురించి అందరికీ షాక్ ఇచ్చాయి.

  పెళ్లికు డుమ్మా కొట్టింది

  పెళ్లికు డుమ్మా కొట్టింది

  ఇటీవల వరుణ్‌మణియన్‌ చెల్లెలు వివాహానికి త్రిషను పిలిచారని, అయితే ఆ వివాహానికి కూడా త్రిష హాజరు కాలేదని, అంతేకాకుండా త్రిష తన చేతిలో ఉన్న నిశ్చితార్థ ఉంగరాన్ని కూడా తీసేశారన్నది తెలిసింది. దాంతో వీళ్లిద్దరి బ్రేకప్ అనేది నిజమే అని అందరూ నిర్దారించుకున్నారు.

  చిత్రం హిట్...బ్రేకప్ షురూ

  చిత్రం హిట్...బ్రేకప్ షురూ

  త్రిషకు వరుణ్‌మణియన్‌తో వివాహ నిశ్చితార్థానికి ముందు పెద్దగా సినిమాలు లేవు. అంతకుముందు అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి పెళ్లికి సిద్ధం అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత త్రిష నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదలైన హిట్ అవ్వడంతో పాటు ఆమెకు మంచి పేరు వచ్చింది.

  ఇదో ఆనందం...

  ఇదో ఆనందం...

  వరుణ్ మణియన్‌తో త్రిష బ్రేకప్‌పై సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులందరూ అయ్యో పాపం అనుకుంటుంటే.. త్రిష శత్రువులంతా హ్యాపీ అని పండగ చేసుకున్నారట. ఆ మధ్యన వరుణ్-త్రిషల ప్రేమాయణం నిశ్చితార్థంతో ఆగిపోయిందని తెలిసి రాయ్ లక్ష్మీ ఫ్రెండ్స్‌కు బిగ్ పార్టీ ఇచ్చిందట.

  రాయ్ లక్ష్మి తట్టుకోలేకపోయిందని

  రాయ్ లక్ష్మి తట్టుకోలేకపోయిందని

  త్రిష-రాయ్ లక్ష్మీ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్. ఈ టైమ్‌లోనే వరుణ్ మణియన్‌ను రాయ్ లక్ష్మీ త్రిషకు పరిచయం చేసింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఎంగేజ్‌మెంట్ వరకు రావడంతో రాయ్ లక్ష్మీకి సహించుకోలేకపోయింది.

  అప్పటినుంచీ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి

  అప్పటినుంచీ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి

  దాంతో రాయ్ లక్ష్మీ.. త్రిషల మధ్య ఫ్రెండ్‌షిప్ కూడా కట్టైంది. అప్పటినుంచీ త్రిష అంటేనే కోపంతో ఊగిపోతూ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్దితికి చేరారు. దాంతో రాయ్ లక్ష్మికి నిశ్చితార్థం ఆగిపోయిందనే వార్త ఫుల్ పండగ చేసుకునేలా చేసిందంటున్నారు. అందుకే రాయ్ లక్ష్మీ ఫ్రెండ్స్‌కి పార్టీ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాల్లో టాక్.

  నాతో డేటింగ్, బ్రేకప్ మళ్లీ నీతో

  నాతో డేటింగ్, బ్రేకప్ మళ్లీ నీతో

  ఒకప్పుడు వరుణ్, లక్ష్మిరాయ్ డేటింగ్ చేసారని,....అయితే త్రిష పరిచయం అయిన తర్వాత వరుణ్ ఆమెకు దూరం అయ్యాడని అంటున్నారు. త్రిష, వరుణ్ మణియన్ విడిపోవడంతో లక్ష్మిరాయ్ చాలా సంతోషంగా ఉందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

  వద్దంటే ఎలా...

  వద్దంటే ఎలా...

  తానూ గత పదేళ్లుగా నటిస్తున్నానని , మంచి ఆఫర్ వస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిందట. దీన్ని సీరియస్ గా తీసుకున్న వరుణ్ కుటుంబ పెద్దలు పెళ్లి కాన్సిల్ చేసుకుంటామని హెచ్చరించినా...త్రిష తగ్గకిపోవడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఇక తానూ ఒంటరిగానే ఉన్నానని, ఈ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుందని త్రిష ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా

  ప్రెగ్నింట్ అయినా సరే..

  ప్రెగ్నింట్ అయినా సరే..

  ‘నేను నటిగా కొనసాగడానికి ఒప్పుకోనందుకే పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నా. నేను ప్రెగ్నెంట్‌ అయినపుడు కూడా కొన్ని నెలల గ్యాప్‌ మాత్రమే తీసుకుంటా. హీరోయిన్‌ వేషాలు రాకపోతే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానైనా కొనసాగుతాను. దానికి ఒప్పుకోనందుకే ఓ వ్యక్తితో తెగదెంపులు చేసుకున్నా. చనిపోయేవరకు నటిస్తూనే ఉంటా. దీనికి అంగీకరించినవాడితోనే పెళ్లిపీటలు ఎక్కుతాన'అని తెగేసి చెప్పింది.

  ఇదో కొత్త కోరిక

  ఇదో కొత్త కోరిక

  బాలీవుడ్ లో పలువురు క్రీడా ప్రముఖుల జీవిత చరిత్రలు సినిమాలుగా వచ్చి, మంచి విజయం సాధిస్తున్నాయని త్రిష పేర్కొంది. ఈ సందర్భంగా తనకు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించాలని ఉందని తెలిపింది. తామిద్దరం ఒకే స్కూల్ (చర్చ్ పార్క్) లో చదువుకున్నామని గుర్తుచేసింది.

  అదొక్కటే అసంతృప్తి

  అదొక్కటే అసంతృప్తి

  సౌత్ లో అందరూ స్టార్ హీరోలతో నటించాను. ఎంతో మంది యంగ్ స్టార్స్ తో జత కట్టాను. అయితే రజనీకాంత్ గారితో నటించే అవకాశం ఇప్పటికీ రాకపోవడంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు ఆమె వెల్లడించారు. సినిమాల్లోకి రాక ముందు నుండే రజనీకాంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వీరాభిమానిని. సినిమాల్లోకి వచ్చాక ఆయనతో అవకాశం వస్తే బావుండు అని చాలా సార్లు అనిపించింది. అయితే 17 కెరీర్లో నాకు ఇప్పటి వరకు అలాంటి అవకాశం దక్కలేదు. ఆ ఒక్క కోరిక తీరితే నా కెరీర్ సంపూర్ణం అయినట్లు భావిస్తాను అని త్రిష చెప్పుకొచ్చారు.

  ఎలాంటి గ్లామర్ రోల్ అయినా

  ఎలాంటి గ్లామర్ రోల్ అయినా

  ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కెరీర్లో చాలా చేసాను. చాలా మంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లతో పని చేసాను అని త్రిష తెలిపారు. సినిమా స్క్రిప్టు, పాత్ర నచ్చితే ఎలాంటి గ్లామర్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధమే అని త్రిష తెలిపారు. త్రిష ఈ మధ్య కాలంలో చాలా హారర్ కామెడీ సినిమాలు చేసింది. అయితే వరుసగా అలాంటి సినిమాలే వస్తుండటంతో కొంతకాలం వరకు ఇలాంటి జేనర్ చిత్రాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోంది.

  కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు

  కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు

  ఇన్ని సంవత్సరాల పాటు ఒక హీరోయిన్ పరిశ్రమలో కొనసాగడం అంటే మామూలు విషయం కాదు. ఇంత కాలం తాను కొనసాగడానికి ప్రేక్షకుల అభిమానమే కారణమని త్రిష తెలిపారు. పరిశ్రమలో రాణించాలంటే కేవలం అందం, టాలెంట్ ఉంటే సరిపోదు.... అదృష్టం కూడా ఉండాలి. ఈ విషయంలో నేను వెరీ లక్కీ అని త్రిష చెప్పుకొచ్చారు. తర్వాతి సినిమాలు త్రిష నటించిన తమిళ చిత్రం ‘కోడి' చిత్రం విడుదలై హిట్టైందని ఆనందంతో చెప్పింది. దీంతో పాటు భోగి, మోహిని చిత్రాల్లో నటిస్తోంది.

  వరసపెట్టి సినిమాలు

  వరసపెట్టి సినిమాలు

  పరిశ్రమలోకి వచ్చి ఇన్ని ఏళ్లు దాటుతున్నా ఇంకా క్రేజీ తగ్గకుండా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నటి త్రిష. ఇటీవలే ధనుష్‌తో కలసి నటించిన ‘కొడి' (తెలుగులో ధర్మ యోగి) సినిమా విడుదలైంది. మరోవైపు తెలుగు, తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్లో తెలుగు, తమిళంలో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించిన ఘనత ఆమెది. పరిశ్రమలో పోటీని తట్టుకుంటూ ఇంత లాంగ్ పీరియడ్ సక్సెస్ పుల్ గా కెరీర్ కొనసాగించడం అంటే మామూలు విషయం కాదు. కెరీపరంగా ఆమెకు ఎలాంటి అసంతృప్తి లేదు. దాదాపు అన్నిరకాల సినిమాలు, పాత్రలు చేసింది.

  English summary
  Actress Trisha Krishnan and entrepreneur and film producer Varun Manian are yet to officially announce their breakup, but there are three big reasons that are a testimony to their broken engagement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X