నయనతారపై బ్యాన్ కి పట్టుపట్టిన డైరక్టర్!!

By Staff

Nayantara
నయనతార పై నిర్మాతల మండలి రెడ్ కార్డ్ బ్యాన్ విధించాలని నిర్ణయానికి దర్శకుడు లింగుస్వామి పట్టుదలే కారణమని సమాచారం. నిజానికి తమిళ నిర్మాతల వారు ఈ బ్యాన్ నిర్ణయానికి రావటానికి చాలా సమయం తీసుకున్నారు. ఒకానొక దశలో బ్యాన్ వద్దనుకున్నారు. అయితే దర్శకుడు లింగు స్వామి దీన్ని ప్రెస్టేజ్ ఇష్యూ గా తీసుకుని తన తోటి దర్శకుల చేత కూడా ప్రెషర్ తీసుకొచ్చారని అంటున్నారు. ఇక ఈ గొడవ పియా సినిమాతో ప్రారంభమయింది. ఆ సినిమాలో నయనతారను కోటి పాతిక లక్షల బడ్జెట్ కి తీసుకున్నారు నిర్మాత,దర్శకుడు అయిన లింగు స్వామి.

అయితే ఆమెకు వరస ఫ్లాఫ్స్ ఎదురవటంతో రేటు తగ్గించుకోమని కోరారు. అయితే ఆమె దానికి ఒప్పుకోలేదు. దాంతో ఆమెను తీసేస్తున్నట్లు ప్రకటించి..తమన్నాని ఆ ప్లేసులో తీసుకున్నాడాయన. అంతే గాక ఆమెకు అడ్వాన్స్ గా ఇచ్చిన పాతిక లక్షలు వెనక్కి తిరిగి ఇవ్వమని అడిగారు. ధానికి ఆమె ఒప్పుకోలేదు. దాంతో లింగు స్వామి...నిర్మాతల మండలిలో రాత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చారు. వారు నయనతారని ఆ విషయమై ప్రశ్నించారు. దానికామె సమాదానంగా ఆ పదిహేను లక్షలు ఇచ్చే ప్రశక్తి లేదని..తను ఆ పియా సినిమాకోసం దాదాపు మూడు నెలల పాటు ఖాళీగా ఉన్నానని ఆ డబ్బు రికవరి చేస్తే...తను అడ్వాన్స్ ఇవ్వటం కోసం ఆలోచిస్తానంది. ఆ మాటలకు ఆగ్రహించిన నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇష్యూ చేసి బ్యాన్ పెట్టనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X