కలసి వస్తుందని పేరు మార్చుకున్న హీరోయిన్
పేరులో కొన్ని పదాలు తీసేసి, మరికొన్నిటిని రిపేర్ చేసేసి స్టార్ హీరోయిన్ రీమ్ సేన్ పేరు మార్చుకుంది. వరస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న ఈమె తన పేరుని రిమ్మీ అని మార్చుకుంది. ఈ విషయమై మాట్లాడుతూ..ఇకనుంచి నన్ను రీమాసేన్ అని పిలవకండి. నా సర్ నేమ్ 'సేన్'ని తీసేశాను. ఇక నుంచి నేను రీమాని కూడా కాదు. 'రిమ్మా'ని' అంటోంది. ఈమె హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం టైటిల్స్ లోనూ రిమ్మీ అనే పేరు పడేలా ఏర్పాటు చేసుకుందని తెలుస్తోంది. ఆ తమిళ చిత్రం'ఆయిరత్తిల్ ఒరువన్' త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో వైవిధ్యభరితమైన పాత్రని పోషించానని, కచ్చితంగా తన కెరీర్‌కి మంచి బ్రేక్ అవుతుందనే ఆశాభావాన్ని..రిమ్మా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాల్సిందేనని చాలా మంది సినిమావాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట. ఆ చర్చలు ఫలిస్తే చాలా గ్యాప్ తర్వాత రిమ్మా తెలుగు తెరపై కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ మార్పు రాగానే..ప్రియదర్శన్ 'మలా మల్ వీక్లీ' హిందీ చిత్రం సీక్వెల్‌లో కూడా నటించే అవకాశం రిమ్మాని వరించింది. చూద్దాం రిమ్మీ పేరుతో పూర్తిగా కలిసి వస్తుందేమో.


Click it and Unblock the Notifications











