నిర్మాత మీద కేసు వేస్తున్నా:రీమా సేన్
సినిమా పబ్లిసిటీ కోసం నా మార్ఫింగ్ చేసి నా నగ్న చిత్రాలను మార్కెట్లో విడుదల చేసారు..ఆ నిర్మాతలను వదిలిపెట్టను..కేసు వేస్తాను...మా లాయిర్ తో సంప్రదింపులు జరుపతున్నా అంది రీమాసేన్.'చిత్రం'సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా 'ఇతి శ్రీకాంత'అనే బెంగాళి సినిమాలో చేసింది.ప్రఖ్యాత బెంగాలీ రచయిత శరత్ రాసిన నవల ఆధారంగా ఆ చిత్రం రూపుదిద్దుకొంది. ఇతి శ్రీకాంతను ఇప్పుడు తమిళంలో అనువదిస్తున్నారు.అంజన్‌దాస్ దర్శకత్వం వహించారు. జాతీయ స్థాయిలో రెండు పురస్కారాలు కూడా వచ్చాయి.అందులో రీమా చేసింది చిన్న పాత్రే అయినా, తమిళ ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి పోస్టర్ల నిండా రీమానే శృంగార భంగిమలతో వేసారు.
వీపున ఏ విధమైన అచ్ఛాదనా లేకుండా కనిపిస్తున్న రీమాసేన్ పోస్టర్లు తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటున్నాయి.ఈ సందర్భంగా మండిపడ్డ రీమాసేన్ మీడియాతో మాట్లాడుతూ..'ఆ పోస్టర్స్ లో ఉన్నది నేను కాదు. నా తల అతికించి మార్ఫింగ్ చేశారంతే..' అని రీమా వ్యాఖ్యానించింది. అంతేకాదు తమిళ నిర్మాతపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటించింది. ''ఇతి శ్రీకాంత.. చాలా మంచి సినిమా. అందులో నేను నటించిన మాట వాస్తవమే. అయితే... శృంగార భంగిమలతో కనిపిస్తున్న చిత్రాలు నావి కావు. ఇదంతా ప్రచారం కోసం నిర్మాతలు వేస్తున్న ఎత్తుగడ. ఈ విషయంలో నేను నా న్యాయవాదుల సలహాలు తీసుకొంటున్నాను'' అని చెప్పింది.


Click it and Unblock the Notifications











