రీమాసేన్ వివాహ తేదీ ఖరారు

By Srikanya

'చిత్రం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ రీమాసేన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాకు తెలియ చేసింది. గతంలో పలుమార్లు తన ఎంగేజ్ మెంట్,ప్రేమ,వివాహ విషయాలును ఖండించిన ఆమె తన వివాహ తేజీన ప్రకటించింది. ఆమె మార్చి 11న తన చిరకాల బోయ్ ప్రెండ్ ప్రముఖ రెస్టారెంట్ యజమాని శివకరణ్ సింగ్ ని వివాహం చేసుకుంటోంది. న్యూ డిల్లీలోని శివకు చెందిన ఫామ్ హౌస్ లో ఆ వివాహం జరగనుంది. పంజాబి,బెంగాళి సంప్రదాయాల కలబోతగా ఆ వివాహాన్ని ఆమె చేసుకుంటోంది. ఇక శివకు ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లు ఉన్నారు.

రీమాసేన్ సినిమాల విషయానికి వస్తే ఆమెకు మనసంతా నువ్వే చిత్రం తర్వాత తెలుగులో పెద్ద హిట్టు ఒకటీ పడలేదు. రీసెంట్ గా కూడా వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ముగ్గురులో ఓ కీ రోల్ ని చేసింది. ఆ సినిమాను ఫెయిల్యూర్ అవ్వటంతో ఆమెను పట్టించుకున్నవాళ్లు లేరు. తమిళంలోనూ యుగానికి ఒక్కడు వంటి పెద్ద సినిమాలు చేసినా అక్కడా క్రేజ్ లేకుండా పోయింది. దాంతో ఆమె బెంగాళికి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆమె బెంగాళీలో చేసిన ఓ సినిమాను ఆ మధ్యన తమిళంలో డబ్ చేసి విడుదలకు ప్లాన్ చేసినప్పుడు రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారంటూ ఆమె గొడవలు కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X