»   » హాట్ పిక్స్: రెజీనా ఇంత హాట్‌గానా.. చంపేసింది, యువ హీరోతో రొమాంటిక్ విన్యాసాలు!

హాట్ పిక్స్: రెజీనా ఇంత హాట్‌గానా.. చంపేసింది, యువ హీరోతో రొమాంటిక్ విన్యాసాలు!

Subscribe to Filmibeat Telugu
Regina Cassandra Hot Pics With Gautham karthik

హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజీనా టాలీవడ్ లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. అన్నీ ఉన్నా అదృష్టం లేదు అన్న చందంగా ఇప్పుడున్న టాప్ హీరోయిన్లకు రెజీనా ఏమాత్రం తక్కువ కాదు. అందం అభినయం కలబోసిన నటి రెజీనా. కానీ కాలం కలసి రాకపోవడంతో ఈ మధ్యన సరైన హిట్ పడలేదు. దీనితో ఈ ముద్దు గుమ్మకు అవకాశాలు బాగా తగ్గాయి. వచ్చిన ఒకటి రెండు ఛాన్సులొ తానేంటో నిరూపించుకోవాలని రెజీనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన అ! చిత్రంలో ప్రయోగాత్మక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం రెజీనా మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన రెజీనా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 చిన్న చిత్రాలతోనే

చిన్న చిత్రాలతోనే

రెజీనా అందచందాలు, నటనకు మొదట్లో అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ సక్సెస్ రేట్ తక్కువగా ఉండడంతో ఈ మధ్యన ఆ భామకు ఛాన్సులు బాగా తగ్గాయి. రెజీనా మొదట్లో చిన్న చిత్రాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. రెజీనా ప్రస్తుతం మిస్టర్ చంద్రమౌళి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

తండ్రి కొడుకు కలసి

తండ్రి కొడుకు కలసి

మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో తమిళ సీనియర్ నటుడు కార్తిన్ నటిస్తున్నారు. కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ ఈ చిత్రంలో హీరో. రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. తండ్రి కొడుకులు కార్తీక్, గౌతమ్ కార్తీక్ కలసి నటిస్తున్న చిత్రం ఇది.

థాయ్‌లాండ్‌లో షూటింగ్ పూర్తి

థాయ్‌లాండ్‌లో షూటింగ్ పూర్తి

ఇటీవలే ఈ చిత్రం థాయ్ ల్యాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. తిరు ఈ చిత్రానికి దర్శకుడు. ధనంజయన్, విక్రమ్ కుమార్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న రెజీనా

హాట్ లుక్స్‌తో చంపేస్తున్న రెజీనా

తాజగా చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబందించిన స్టిల్స్ ని విడుదల చేసారు. రెజీనా యువతకు పిచ్చెక్కించేలా హాట్ ఫోజుల్లో కాకరేపుతోంది. గౌతమ్ కార్తీక్ తో కలసి ఈ చిత్రంలో రెజీనా రొమాన్స్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ రొమాంటిక్ లుక్స్ లో అదరగొడుతున్నారు. రెజీనా తడి అందాలతో మెరిసిపోతోంది.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

రెజీనా హాట్ స్టిల్స్ తక్కువ టైం లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. గ్లామర్ ప్రియులని ఈ స్టైల్ తెగ ఆకర్షించేవిగా ఉన్నాయి. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న రెజీనా ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉంది.

విడుదలకు సన్నాహకాలు

విడుదలకు సన్నాహకాలు

కార్తీక్, గౌతమ్ కార్తీక్ కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే. థాయ్ ల్యాండ్ లో షూట్ చేసిన సాంగ్ తో చిత్ర చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు.

English summary
Regina Cassandra hot pics with Gautham karthik goes viral. Regina acting Tamil movie Mr Chandramouli
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X