నడిరోడ్డుపైనే అకతాయి నా పెదవులపై ముద్దు .. చేదు అనుభవాలను బయటపెట్టిన రెజీనా
దక్షిణాది నటి రెజీనా కసండ్రా తన జీవితంలో చోటుచేసుకొన్న చేదు ఘటనలను తాజాగా మీడియా ఇంటర్వ్యూలో పంచుకొన్నారు. ఆ సంఘటనలు నన్ను ఎప్పుడూ వెంటాడుతుంటాయని, ఆ తర్వాత కొన్ని సంఘటనలు నన్ను మానసికంగా ధృడంగా చేశాయని ఆమె చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో సెలబ్రిటీలకు ఎదురయ్యే సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తాయని చెప్పారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతూ..

మరిచిపోలేని చేదు అనుభవాలు
అందాల నటి రెజీనా ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన మిస్టర్ చంద్రమౌళి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన జీవితంలో మరిచిపోని కొన్ని చేదు అనుభవాలను పంచుకొన్నారు. స్కూల్, కాలేజీ లైఫ్‌లో కొన్ని రకాలు వేధింపులకు గురయ్యానని రెజీనా చెప్పారు.

నా కాలేజ్ డేస్‌లో కూడా
నా కాలేజీ డేస్‌లో మరిచిపోలేని సంఘటనలు ఎదురయ్యాయి. చెన్నైలోని ఈగ థియేటర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న సినిమా హాల్ సమీపంలో కొందరు నాపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఓ యువకుడు నా శరీరంపై తాకరాని చోట తాకేందుకు ప్రయత్నించారు. నా పెదవులపై ముద్దు పెట్టుకొనేందుకు ప్రయత్నించారు. జరగబోయే సంఘటనను ముందే పసిగట్టి గట్టిగా ప్రతిఘటించాను అని రెజీనా తెలిపారు.

స్కూల్ డేస్‌లోనే వేధింపులు
నా స్కూల్ రోజుల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదరయ్యాయి. అయితే ఆ సమయంలో నేను చాలా బలహీనంగా ఉండేదానిని. ఎదుటి వ్యక్తిని ఎదురించే బలం నాకు లేకపోయేది. నాకు అలాంటి సంఘటనలు ఎదురైన తర్వాత నేను శారీరీకంగా బలంగా తయారు కావాలని నిర్ణయించుకొన్నాను. అప్పటి నుంచే గుంపులోకి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకొనే దానిని. ఒంటరిగా వెళ్లకుండా స్నేహితులతో కలిసి వెళ్లేదానిని అని రెజీనా చెప్పారు.
Recommended Video

శారీరక ధృడత్వం కోసం వ్యాయామాలు
కాలేజీలో చదివే రోజుల్లోనే శారీరక ధృడత్వంపై దృష్టిపెట్టాను. శారీరాన్ని బలంగా మార్చే కసరత్తులు, వ్యాయామం చేస్తూ పటిష్టంగా తయారయ్యాను. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా చాలా ఎదిగాను. అప్పటి కాలంతో పోల్చుకొంటే యువతులకు ఇప్పుడు వేధింపులు ఎక్కువే. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల వేధింపులు రకరకాలుగా ఎదురవుతున్నాయి అని రెజీనా అన్నారు.


Click it and Unblock the Notifications











