రజనీకాంత్‌కు షాక్, రాణా సినిమాను తిరస్కరించిన రేఖ
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం రావడమే అదృష్టమని తారామణులు భావిస్తుంటారు. అయితే, ఒకప్పటి సెక్సీ స్టార్ రేఖ రజనీకాంత్‌తో కలిసి రాణాలో నటించడానికి అంగీకరించడం లేదు. అయితే ఇందుకు కారణం, రజనీ కాదు. కొన్ని ఆర్థిక అంశాల వల్ల రాణా నుంచి ఆమె వైదొలగింది. దాంతో రజనీ సరసన హేమమాలిని కోసం నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సినిమాలో రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఫిమేల్ లీడ్ రోల్‌లో దీపికా పడుకొనే నటిస్తోంది. మరో ఇద్దరు కథానాయికలు కావాల్సి ఉంది. రేఖ డ్రాప్ కావడంతో ఆ అవసరం ఏర్పడింది.
రజనీకాంత్ నటిస్తున్న వృద్ధుడి పాత్ర సరనస నటించేందుకు రేఖను ఎంపిక చేశారు. రజనీకాంత్ పోషించే యువకుడి పాత్రకు జంటగా దీపికా పడుకొనే నటిస్తుంది. నిర్మాతలకు, తనకు మధ్య ఆర్థికపరమైన వివాదాలు తలెత్తడంతో రేఖ వైదొలిగినట్లు చెబుతున్నారు. రేఖ నాలుగు కోట్ల రూపాయలు అడిగినట్లు సమాచారం. అయితే, నిర్మాతలు అంత పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్దంగా లేరు. దీంతో హేమమాలిని నిర్మాతలు సంప్రదించారు. త్వరలోనే ఆమెను కలుస్తారు కూడా. ఎరోస్ అధికార ప్రతినిధి ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరించారు.
విద్యాబాలన్ కూడా ఈ సినిమా నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. అయితే, ఈమె సమస్య వేరు. తనకు చదివేందుకు స్క్రిప్టు ఇవ్వాలని, స్క్రిప్టు చూసిన తర్వాతనే ఏ విషయమూ చెబుతానని విద్యాబాలన్ చెప్పిందట. అయితే, నిర్మాతలు అందుకు ఇష్టపడడం లేదు. తాము విద్యాబాలన్‌ను అడగలేదని, స్క్రిప్టులో మార్పులు చేశామని, దాని వల్ల విద్యాబాలన్‌ను వద్దని అనుకుంటున్నామని దర్సకుడు కెఎస్ రవికుమార్ అంటున్నారు. ఏప్రిల్‌లో సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











