twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతతో వేరే రిలేషన్ లేదని ఖండన

    By Srikanya
    |

    నా ఫేటే అలా ఉంది. ఇంతకుముందు సమీరా రెడ్డి అన్నారు.. ఇప్పుడు సమంత అంటున్నారు. నాకు సమంతతో ప్రొఫిషనల్ రిలేషన్ తప్ప వేరే ఏ విధమైనవి లేవంటూ ఖండించారు దర్శకుడు గౌతమ్ మీనన్. ఆయన తన తాజా చిత్రంలో ఆమెను మూడు భాషలకు గానూ హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయమై తమిళ పత్రికల్లో ఆమెకీ, దర్శకుడుకీ మధ్య వేరే విధమైన రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు వచ్చాయి. వాటిపై దర్శకుడు మాట్లాడుతూ ఇలా ఖండించారు.అలాగే ఇలాంటి రూమర్స్ వల్ల నా కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. నిజానికి సమంతలో కొద్ది నెలల క్రిందటకి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఆమె మొదటి టేక్ లో సీన్ లు ఓకే చేసేస్తోంది.ఆమెకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆమెతో సినిమా చెయ్యాలంటే నిర్మాతలు ఉత్సాహం చూపెడుతున్నారు.

    ఎంతలా అంటే హీరో ఎవరనేది కూడా అడగటం లేదు. అందుకే్ ఆమెను నా సినిమాలో తీసుకున్నాను.అంతకుమించి ఆమెపై నాకు స్పెషల్ ఇంట్రస్ట్ ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు.ఇక నాని హీరోగా తెలుగు వెర్షన్ కి ఆయన చిత్రం చేస్తున్నారు.ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.

    English summary
    Gautam Menon said, “My fate is like that. Earlier it was Sameera Reddy and now it is Samantha. I should be worried about these rumors only if the people around me and my family members believe these rumors.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X