సంగీత సినిమాపై తీవ్ర దుమారం

కె.బాలచందర్ శిష్యుడైన శివకి ఈ సినిమా మొదటిది. రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతున్న ఈ సినిమా కథ ఓ వేశ్య చుట్టూ తిరుగుతుంది. ఆ వేశ్యఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలోకి ప్రవేశిసించి తాను ఆ ఇంటి కోడలినంటూ చెప్పి అక్కడ సెటిలవుతుంది. ఆమెకు మద్దతుగా ఓ జ్యోతిష్కుడు ఉంటాడు. అతడు ఆమె ఆ ఇంటిలోకి రావటం వల్ల వారికి ధనం లాభిస్తుందని చెప్తాడు. తర్వాత ఆమె ఆ ఇంటి వారిపై పగ తీర్చుకునే ప్రయత్నాలు చేస్తుందిట. ఎందుకంటే ఆమె జోగినిగా చిన్నప్పుడే మారటానికి ఆ కుటుంబమే కారణమట ఆ విషయం చిత్రం చివరలో రివిల్ అవుతుంది.
ఇక ఈ కథ లీకవటం వెనుక ఎవరి హస్తం ఉన్నా...ప్రస్తుతం ఇది కోట్ల మంది హిందువుల సెంటిమెంట్స్ ని అవమానపరుస్తోందని క్లైమాక్స్ ని,జ్యోతిష్కుడు ఎపిసోడ్ ని తొలిగించాలని ఆ హిందూ సంరక్షణ సంఘం వారు అంటున్నారు. అలాగే ప్రేక్షకులను వారు అవగాహనారాహిత్యంతో చేసే ఇలాంటి హాఫ్ బేకెడ్ ఫిల్మ్ ని ఆదరించవద్దని వారు కోరుతున్నారు. ఇక ఈ వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తీసుకుంటుందో గానీ ప్రస్తుతం మాత్రం మంచి పబ్లిసటీని ఆ సినిమాకి సమకూరుస్తోందని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications











