మురుగదాస్ దర్శకత్వంలో సంగీత దర్శకుడు హీరోగా...
చెన్నై : గజనీ,సెవెంత్ సెన్స్, ఠాగూర్ వంటి చిత్రాల ద్వారా తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్న దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్. విజయ్ తో తుపాకి చిత్రం షూటింగ్ పూర్తి చేసిన ఆయన తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి తన చిత్రంలో హీరోగా రెహమాన్ మేనల్లుడిగా పరిచయమై... స్వర ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్న సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ ని ఎంచుకున్నారు. జి.వి.ప్రకాష్‌కుమార్ రీసెంట్ గా రామ్ హీరోగా చేసిన "ఎందుకంటే ప్రేమంట" చిత్రానికి సంగీతం అందించారు. అలాగే అంతకుముందు ప్రభాస్ ..డార్లింగ్ చిత్రానికి,ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రాలకి సంగీతం అందించారు.
తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో స్వరకర్తగా జి.వి.ప్రకాష్‌కుమార్ పూర్తి బిజీ గా ఉన్నారు. అయితే మురగదాస్ ఒప్పించి,హీరోని చేస్తున్నారు. ఈ సినిమా కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఫాక్స్ స్టార్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథా చర్చలు ముగిశాయి. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''సంగీత నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రకాష్ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది. మరో హీరోకీ చోటుంది. త్వరలోనే ఆ వివరాలూ ప్రకటిస్తాం'' అని మురుగదాస్ చెబుతున్నారు.
ఎ.ఆర్.మురగదాస్ తమిళంలో తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'తుపాకి'. ఇందులో విజయ్, కాజల్ జంటగా నటించారు. మురగదాస్ గతంలో తీసిన 'స్టాలిన్', 'గజిని', 'సెవెన్త్ సెన్స్' అటు తమిళ నాట, ఇటు తెలుగునాట మంచి ఆదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం 'తుపాకి' చిత్రాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు అనువాద హక్కుల కోసం చాలా పోటీ ఏర్పడింది. ఈ పోటీలో ఎస్.వి.ఆర్. మీడియా అధినేత్రి శోభారాణి ఫ్యాన్సీ రేటు ఆఫర్ ఇచ్చి తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నారు.
నిర్మాత శోభారాణి మాట్లాడుతూ ''ముంబయి నేపథ్యంగా నడుస్తుందీ చిత్రం. తుపాకీ కథాకమామీషు ఉత్కంఠభరితంగా ఉంటుంది. సాంకేతికంగా ఉన్నతస్థాయిలో నిర్మితవుతోంది'' అన్నారు. ఈ చిత్రంలో ఎ.ఆర్.మురుగదాస్ స్పెషల్ అప్పియరెన్స్ చేస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో, ఉత్తమ సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











