ఇన్నాళ్లూ భాష తెలియక ఆగా... : రామ్ గోపాల్ వర్మ

రాంగోపాల్‌వర్మ దర్శకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాన్‌దాన్‌డా'(తెలుగు సత్య-2). శర్వానంద్ హీరో. అనైక హీరోయిన్ . ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. నిర్మాత సతీష్, రాంగోపాల్‌వర్మ, శర్వానంద్, అనైకలు మీడియాతో ముచ్చటించారు.
అలాగే రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. .తిరుచ్చి, మదురై ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. చెన్నైలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. శర్వానంద్ పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు. హింసాత్మక కథాంశాలనే ఎందుకు ఎంచుకుంటున్నారని ప్రశ్నించగా.. నాలో క్రూర గుణాలు ఎక్కువ అందుకే ఇలాంటి కథను ఎంచుకుంటానని చెప్పారు.
శర్వానంద్ మాట్లాడుతూ.. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఇలాంటి పాత్రలో నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా నా కెరీర్‌ను తప్పకుండా మలుపుతిప్పుతుంది, రామ్‌గోపాల్ వర్మ సినిమాలో చిన్న పాత్రైనా చేయాలన్నది నా కల. అది ఇప్పుడు తీరింది. ఆయన దగ్గర నుంచి రోజూ ఏదొక విషయం నేర్చుకున్నాను. ఈ సినిమాలో కొత్త రకం నేరాల్ని చూపించబోతున్నారు అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''మంచి సినిమాను తీశానని అనుకుంటున్నా. విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంద''న్నారు. అనైక మాట్లాడుతూ ''ఇది నా మొదటి సినిమా. వర్మగారి దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది''అన్నారు.


Click it and Unblock the Notifications











