శృతిహాసన్ కు చెప్పు దెబ్బ కొట్టిన రిచా!?
శృతిహాసన్ తాను పెద్ద స్టార్ ని అయ్యానని నమ్మకమో..లేక స్టార్ కూతురునని ఆత్మ విశ్వాసమో కానీ తోటి హీరోయిన్స్ ని చిన్న చూపు చూస్తోంది. ఈ నేపధ్యంలో ఆమెకు మిరపకాయ ఫేమ్ రిచా గంగోపాధ్యాయ కౌంటర్ ఇచ్చి చెప్పు దొబ్బ కొట్టినంత పనిచేసింది. వివరాల్లోకి వెళ్లితే రిచా రీసెంట్ గా చాలా క్యాజువల్ గా శృతిహాసన్ కి గ్రీట్ చేస్తూ ట్విట్టర్ లో మెసేజ్ పెట్టింది. దానికి సమాధానంగా వెంటనే శృతిహాసన్...ఎవరు రిచా అంటూ రిప్లై ఇచ్చింది..అయితే రిచా ని తెలియదు అనుకోవటానికి లేదు ..ఎందుకంటే ట్విట్టర్ లో ఆమె వివరాలు ఆ ప్రక్కనే ఉంటాయి. అలాగే శృతి హాసన్ తెలుగులో కంటిన్యూగా సినిమాలు చేస్తోంది. అయితే ఈ విషయం రిచాకు చాలా కోపం తెప్పించినట్లుంది.
వెంటనే కౌంటర్ గా ఆమె...నేను రిచాను..నేను నీ కో స్టార్ ధనుష్ తో తమిళంలో యాక్ట్ చేస్తున్న దాన్ని, అలాగే నువ్వు చేయబోతున్న గబ్బర్ సింగ్ ని డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ముందు చిత్రం మిరపకాయ్ లో హీరయిన్ని అంటూ స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది. ఇది చదివిన వాళ్ళంతా రిచా భలే చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చిందే శృతికి అంటున్నారు. ఇక రిచా తెలుగులో లీడర్ సినిమాతో పరిచయమైంది. ఇక శృతి తెలుగులో అనగనగా ఓ ధీరుడు చిత్రంతో పరిచయమై సిద్దార్ద సరసన ఓ మై ప్రెండ్ చిత్రాలు చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్,ఎన్టీఆర్ సరసన బోయపాటి దర్శకత్వంలో రూపొందే దమ్ము చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











