హీరోయిన్‌కు హీరో అభిమానుల వేధింపులు

By Bojja Kumar

లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ప్రవేశించి, రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో నటించి మిర్చి బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ్ ప్రస్తుత తమిళ సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయమై తన మనసులోని వ్యవధను ట్వట్టర్ ద్వారా బయటకు వెల్లగక్కింది. ''నేనేంటో, నా మనస్తత్వం ఎలాంటిదో తెలియనివారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా కారణంగా ఇతరులు గొడవపడటం నాకిష్టం లేదు. అందుకే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది"" అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ బ్యూటీ ఇలా మాట్లాడటానికి కారణం శింబు అభిమానులు. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన 'మయక్కమ్ ఎన్న", శింబు పక్కన 'ఓస్తి" చిత్రంలో నటిస్తూ తమిళంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలూ వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఇటీవల 'మయక్కమ్ ఎన్న" షూటింగ్‌లో వరుసగా పాల్గొనడంవల్ల రిచా ఈ చిత్రం గురించి ఎక్కువగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ కారణంగా శింబు అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. మా హీరో సినిమా విశేషాలు చెప్పవా? అంటూ రిచాపై మాటల దాడికి దిగారు. దాంతో ధనుష్ అభిమానులు రిచాకి సపోర్ట్‌గా శింబు అభిమానులపై మాటల తూటలు వదిలారు. ఇది గాలి వాన అవుతుందని ఊహించిన రిచా పై విధంగా స్పందించారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ? అనే పాయింట్ రైజ్ చేయడం కూడా అనవసరం. ఈ రెండు చిత్రాలూ నాకు మంచి అనుభవాన్నిస్తున్నాయి. తమిళంలో నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నాను. కానీ ఏమీ లేని విషయాన్ని వివాదం చేయడం బాధ కలిగిస్తోందని పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X