మిరపకాయ్ హీరోయిన్ కి మిస్ ఇండియా ఆఫర్...!
కొంతమంది ఇలా వచ్చి అలా స్టారలై పోతుంటారు. ఒక్క సినిమా వాళ్ల కెరీర్ ని మార్చేస్తుంటుంది. అయితే, కొంతమంది కెరీర్ మాత్రం స్లోగా అందుకుంటుంది. రిచా గంగోపాద్యాయ ఈ రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్. అందుకే, తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్ళయినా ఆమె కెరీర్ ఇంకా గాడిలో పడలేదు. రెండేళ్ల క్రితం 'లీడర్" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అందులో తను పోషించిన అర్చన పాత్రకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత 'నాగవల్లి" లో గౌరీ క్యారెక్టర్, ఇటీవల 'మిరపకాయ్" లో వినమ్ర పాత్ర చేసి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. కాగా రీసెంట్ గా ఒక తమిళ సినిమాకు ఆఫరొచ్చిన్నట్టు సమాచారం.
ఫారిన్ లో పుట్టిపెరిగిన రిచా మిస్ ఇండియా ఎలా అవుతుందని అనుకుంటున్నారా. ఓ తమిళ్ సినిమాలో రిచా మిస్ ఇండియా రోల్ ప్లేచేయబోతోంది. తెలుగులో అకాశాలు కరువైన రిచాకి తమిళ్ హీరో విజయ్ పిలిచి ఆఫరిచ్చాడు. గ్రేట్ డైరెక్టర్ సీమన్ దర్శకత్వంలో 'పాగల్వన్" అనే సినిమాలో విజయ్ కి జంటగా రిచా గంగోపాధ్యాయ, మరొక పాత్రలో దేశముదురు హన్సిక నటించబోతున్నారు. ఇందులో ఓ హీరోయిన్ మిస్ ఇండియాగా నటించాలి. ఆ అవకాశాన్ని రిచాకి ఇచ్చాడు దర్శకుడు. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన రిచా, తమిళ్ లో అయినా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications











